Advertisementt

కీర్తి సురేష్ 150 నుంచి 200కు పెంచుతుందంట!!

Mon 31st Aug 2020 12:07 AM
keerthi suresh,surya namaskarams,video,sarkaru vaari paata,aadipurush  కీర్తి సురేష్ 150 నుంచి 200కు పెంచుతుందంట!!
Keerthi Suresh workouts Video Viral in Social Media కీర్తి సురేష్ 150 నుంచి 200కు పెంచుతుందంట!!
Advertisement
Ads by CJ

హీరోయిన్స్ ఎవరైనా అందంగా ఆకర్షణగా కనిపించాలి అంటే.. మంచి ఫిట్‌నెస్ అలాగే ఆరోగ్యకరమైన డైట్‌తో కుస్తీలు పడతారు. స్లిమ్‌గా ఉండి.. బికినీ షోలకు అనువుగా ఉంటేనే కెరీర్ కొన్నాళ్ళు నిలబెట్టుకునేలా ఉంది ఈ కాలం. అందుకే హీరోయిన్స్ జిమ్‌లు, యోగాలు అంటూ ఒళ్ళుకరిగించుకుంటారు. అయితే ఒకప్పుడు కాస్త బొద్దుగా ముద్దుగా ట్రెడిషనల్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తాను నటించిన మహానటి సావిత్రి బయోపిక్ కోసం కొంచెం ఎక్కువగానే బరువు పెరిగింది. అయితే ఆ బరువు వలన కీర్తి సురేష్ రెండేళ్లు.. కెరీర్‌లో సినిమాల నుండి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత బాగా చిక్కి గ్లామర్ గా, సన్నగా మారింది. దెబ్బకి స్టార్ హీరోల అవకాశాలు పరిగెత్తుకొచ్చాయి. అయినా కీర్తి సురేష్ బరువు‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి నానా తంటాలు పడుతుంది. ఓ టార్గెట్ పెట్టుకుని మరీ బరువుని అదుపులో ఉంచుకుంది.

ఫిట్‌నెస్ కోసం కీర్తి సురేష్ రోజు ఏకంగా యోగాలో 150 సార్లు సూర్య నమస్కారాలు చేస్తుంది. ప్రస్తుతం రోజుకి 150 సార్లు నమస్కారాలు చేస్తున్న కీర్తి సురేష్ ఆ సూర్య నమస్కారాలు సంఖ్యని 200 సార్లు పెంచాలంటుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ సూర్య నమస్కారాలు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి 200 సార్లు సూర్య నమస్కారాలంటే కీర్తి సురేష్ మరింత స్లిమ్‌గా పూర్తికి ఫిట్ నెస్‌తో అందంగా కనిపించడం ఖాయం. మరి మహానటి తర్వాత కీర్తి సురేష్ కెరీర్ అయ్యిపోయింది అనుకుంటే.. ఇప్పుడు బరువు తగ్గి అందంగా తయారయ్యాక.. మళ్లీ స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు కీర్తి సురేష్ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి. ఇప్పటికే సౌత్‌లో మహేష్ తో సర్కారు వారి పాటలో ఛాన్స్ దక్కించుకున్న కీర్తి సురేష్.. ప్రభాస్ ఆదిపురుష్ పాన్ ఇండియా మూవీలో సీత పాత్రకి హీరోయిన్స్ లిస్ట్ లో పరిశీలనలో ఉన్నట్లుగా టాక్ ఉంది.

Keerthi Suresh workouts Video Viral in Social Media:

Keerthi Suresh Surya Namaskarams video Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ