Advertisementt

అలా చేయమని మహేషే చెబుతున్నాడా...?

Sat 29th Aug 2020 07:53 PM
sarkaru vaari paata,mahesh babu,parashuram,thaman  అలా చేయమని మహేషే చెబుతున్నాడా...?
Parashuram completing music sittings.. అలా చేయమని మహేషే చెబుతున్నాడా...?
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ప్రకటించినప్పటి నుండి అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఐతే సినిమా ప్రకటన చేసి చాలా రోజులవుతున్నా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. కరోనా కారణంగా ఇప్పట్లో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిన తర్వాతే సినిమా షూటింగ్ మొదలు పెడతారట.

ఐతే అప్పటిలోగా పరశురామ్ తన పని తాను చేసుకుంటున్నాడట. స్క్రిప్ట్ పనులు ఆల్రెడీ పూర్తి కావడంతో మ్యూజిక్ పై కూర్చున్నాడట. గతంలోనే ప్రకటించినట్టు ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం పరశురామ్ థమన్ తో మ్యూజిక్స్ సిట్టింగ్స్ వేస్తున్నాడట. ఒకటి కాదు రెండు కాదు పూర్తిగా సినిమాలో ఎన్ని పాటలున్నాయో అన్ని పాటలు ట్యూన్ చేయించుకుంటున్నాడట. ఈ టైమ్ పూర్తిగా దానికే వినియోగించాలని భావిస్తున్నాడట.

అంటే చిత్రీకరణ వెళ్లేముందే మొత్తం పాటలు పూర్తవుతాయట. ఈ మేరకు మహేష్ బాబు అలా చేయమని ఉంటాడని అంటున్నారు. ఐతే థమన్ కి ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఆ తర్వాత బిజీ అవుతాడు. అందువల్ల ఇప్పుడైతే ఈజీగా ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే పరశురామ్ సిట్టింగ్స్ పూర్తి చేస్తున్నాడట. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాని మైత్రీ మూవేమేకర్స్, 14రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తుంది.

Parashuram completing music sittings..:

Parashuram completing music sittings..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ