Advertisementt

ఆ వరస్ట్ రికార్డ్ కూడా ఆ సినిమాకే..

Sat 29th Aug 2020 07:30 PM
sadak2,alia bhat,aditya rai kapoor,sanjay dutt,mahesh bhat  ఆ వరస్ట్ రికార్డ్ కూడా ఆ సినిమాకే..
worst record of bollywood movie.. ఆ వరస్ట్ రికార్డ్ కూడా ఆ సినిమాకే..
Advertisement
Ads by CJ

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించిన సడక్ 2 చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైంది. ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్ నటించిన ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అప్పట్లో మహేష్ భట్ ఎంత పెద్ద దర్శకుడో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు తన సూపర్ హిట్ మూవీ సడక్ చిత్రానికి సీక్వెల్ గా సడక్ 2 అంటూ వచ్చాడు. ఈ సినిమా చూసిన వాళ్లందరూ అనవసరంగా ఇంటర్నెట్ డేటా లాస్ చేసుకోవద్దని చెబుతున్నారు.

తాజాగా ఈ చిత్రానికి ఐఎమ్ డీబీ రేటింగ్స్ లో వరస్ట్ రేటింగ్ వచ్చింది. కేవలం 1.1 రేటింగ్ తో రికార్డు క్రియేట్ చేసింది. ఇంతవరకూ ఏ బాలీవుడ్ చిత్రానికి కూడా ఇంత తక్కువ రేటింగ్ రాలేదు. నెపోటిజం కారణంగా ఈ చిత్ర ట్రైలర్ కి విపరీతంగా డిస్ లైక్స్ పడిన సంగతి తెలిసిందే. అప్పుడు డిస్ లైక్స్ తో రికార్డు క్రియేట్ చేసిన సడక్ 2 రేటింగ్ తో వరస్ట్ రికార్డుని ఖాతాలో వేసుకుంది. ఈ విషయమై సడక్ 2 చిత్రంపై సోషల్ మీడియాలో చాలా జోక్స్, మీమ్స్ వస్తున్నాయి.

worst record of bollywood movie..:

worst record of bollywood movie..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ