Advertisementt

వంశీతో ఇక మహేష్ సినిమా లేనట్లేనా?

Sun 30th Aug 2020 11:48 PM
mahesh babu,vamsi paidipally,maharshi,anil ravipudi,sarileru neekevvaru,sarkaru vaari paata  వంశీతో ఇక మహేష్ సినిమా లేనట్లేనా?
Doubts on Mahesh Babu and Vamsi Paidipally Combo వంశీతో ఇక మహేష్ సినిమా లేనట్లేనా?
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడితో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేసిన తర్వాత ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మరో సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే వంశీ పైడిపల్లి కథ నచ్చకో.. లేదంటే ఏం జరిగిందో తెలియదు కానీ... వంశీ పైడిపల్లి సినిమాకి నో చెప్పి పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’కు మహేష్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే మహేష్ బాబు ఏ డైరెక్టర్‌తో మెయింటైన్ చేయని క్లోజ్‌నెస్ వంశీతో, ఆయన ఫ్యామిలీతో చేశాడు. వంశీ పైడిపల్లి - మహేష్ ఫ్యామిలీస్ రెండూ కలిసిమెలిసి ఉండేవారు. అయితే మహేష్‌తో సినిమా ఆగిపోయాక కూడా వంశీ మహేష్ ఫ్యామిలీతోనే ఉన్నాడు.

మహేష్ ‘సర్కారు వారి పాట’ తర్వాత వంశీతో సినిమా చేస్తాడనే టాక్ ఉంది. కానీ మహేష్ వరస చూస్తుంటే వంశీతో ఇప్పుడప్పుడే సినిమా ఆలోచన లేనట్లుగా కనబడుతుంది. మహేష్ ‘సర్కారు వారి పాట’ తర్వాత అధికారికంగా రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. ఒకవేళ అది జరగక కాస్త లేట్ అయినా.. మహేష్ తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడితో చేసినా చేయవచ్చు అనే ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సర్కారు వారి పాట - రాజమౌళి సినిమా గ్యాప్‌లో అనిల్‌తో సినిమా చుట్టేసినా చుట్టెయవచ్చు అని అంటున్నారు. మరి తర్వాత త్రివిక్రమ్, కొరటాల అంటాడు కానీ.. వంశీ పేరుని మహేష్ ఎత్తేలా కనిపించడం లేదు. ఫైనల్‌గా, మహేష్ వంశీకి హ్యాండ్ ఇవ్వడం పక్కా అన్నమాట. 

Doubts on Mahesh Babu and Vamsi Paidipally Combo:

Mahesh babu Not interested movie with Vamsi Paidipally

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ