Advertisementt

నాగచైతన్య థ్యాంక్యూ.. చెప్పేసాడు..

Sat 29th Aug 2020 12:16 PM
nagachaitanya,vikram k kumar,thank you,nagarjuna,dil raju  నాగచైతన్య థ్యాంక్యూ.. చెప్పేసాడు..
Naga chaitanya said Thank You.. నాగచైతన్య థ్యాంక్యూ.. చెప్పేసాడు..
Advertisement
Ads by CJ

వరుస విజయాలతో జోష్ మీదున్న నాగచైతన్య వరుసగా సినిమాలని లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్ర చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. కరోనా లేకుంటే ఈ పాటికి రిలీజై ఉండేది. ఐతే లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉంటుందనే విషయమై గత కొన్ని రోజులుగా చాలా వార్తలు వచ్చాయి.

తాజాగా నేడు చిత్ర ప్రకటన వచ్చేసింది. అక్కినేని నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని నాగచైతన్య తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఈ మేరకు థ్యాంక్యూ పోస్టర్ తో నాగార్జున కి బర్త్ డే విషెస్ తెలియజేసారు. అందరూ అనుకున్నట్టుగానే మనం సినిమాతో పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్ళనుంది. మనం తర్వాత సరైన సక్సెస్ అందుకోలేకపోయిన విక్రమ్ కె కుమార్ థ్యాంక్యూ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి.

Naga chaitanya said Thank You..:

Naga chaitanya said Thank You..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ