Advertisementt

నాగార్జున వైల్డ్ డాగ్ కొత్త పోస్టర్ వచ్చేసింది..

Sat 29th Aug 2020 11:56 AM
nagarjuna,wild dog,solomon,ali reza,sayami kher  నాగార్జున వైల్డ్ డాగ్ కొత్త పోస్టర్ వచ్చేసింది..
Nagarjuna Wild dog poster.. నాగార్జున వైల్డ్ డాగ్ కొత్త పోస్టర్ వచ్చేసింది..
Advertisement
Ads by CJ

మన్మధుడు 2 సినిమా తర్వాత నాగార్జున చేస్తున్న చిత్రం.. వైల్డ్ డాగ్. సోలోమన్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుండి నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని పోస్టర్ విడుదలైంది. ఇంతకుముందు విడుదలైన పోస్టర్ కంటే ఈ పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది. ఎన్ ఐ ఏ ఏజెంట్ గా నాగార్జున లుక్ అదిరిపోయింది. చెట్లకొమ్మల్లాగా డ్రెస్ చేసుకుని చేతిలో గన్ పట్టుకుని శత్రువులకి గురి పెడుతున్నాడు. విజయ్ వర్మ పేరు గల ఆఫీసర్ ని వైల్డ్ డాగ్ అంటున్నారు.

ఇప్పటి వరకు 12 మిషన్లు కంప్లీట్ చేసినట్టుగా ఇచ్చారు. ఈ పోస్టర్ లో నాగార్జునతో పాటు మరికొంత మంది కూడా ఉన్నారు. సయామీ ఖేర్, రా ఏజెంట్ గా కనిపిస్తుండగా, బిగ్ బాస్ ఫేమ్ ఆలీ రెజా ఎన్ ఐ ఏ ఫీల్డ్ ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. దియా మీర్జా నాగార్జున సరసన కనిపిస్తున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి    సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లో తెరకెక్కుతోంది.

Nagarjuna Wild dog poster..:

Nagarjuna Wild dog poster..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ