Advertisementt

మరో తారపై సుశాంత్ అభిమానుల ఆగ్రహం!

Sat 29th Aug 2020 07:23 PM
nepotism,susanth singh rajput,ananya pandey,khaali peeli  మరో తారపై సుశాంత్ అభిమానుల ఆగ్రహం!
Nepotism effect on Ananya Pandey New movie మరో తారపై సుశాంత్ అభిమానుల ఆగ్రహం!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ కి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చుక్కలు కనబడుతున్నాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో సినీ వారసులను సుశాంత్ అభిమానులు ఆడుకుంటున్నారు. సుశాంత్ ఆత్మహత్యతో వాళ్ళకి సంబంధం లేకపోయినా.. బాలీవుడ్ నెపోటిజంపై సుశాంత్ అభిమానులు కక్ష కట్టారు. అందుకే స్టార్ కిడ్స్ నటించిన సినిమాలకు చుక్కలు చూపెడుతున్నారు. అలియా భట్ సడక్ 2 ట్రైలర్‌కి రికార్డు స్థాయిలో డిస్ లైక్స్ కొట్టిన సుశాంత్ అభిమానులు.. బాలీవుడ్ ప్రేక్షకులు.. ఇప్పుడు మరో స్టార్ కిడ్ అనన్య పాండే మీద పడ్డారు. మొన్నటికి మొన్న జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా పై తీవ్రంగా ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు అనన్య పాండే నటించిన ఖాలీ పీలీ ట్రైలర్‌కి రికార్డు స్థాయిలో డిస్ లైక్స్ బారిన పడేటట్లు చేసారు.

మా అమ్మాయి స్టార్ కిడ్ కాదు.. నేను స్టార్‌ని కాదు అని అనన్య పాండే తండ్రి చుంకీ పాండే కామెడీ చేసినా సుశాంత్ అభిమానులు మాత్రం అనన్య సినిమాకి చుక్కలు చూపించడానికి రెడీ అయ్యారు. ఇకపై జాన్వీ కానీ, అలియా కానీ, సోనాక్షి కానీ, సారా కానీ, అనన్య కానీ ఎవ్వరి సినిమాలైనా సుశాంత్ అభిమానులు ఇదే రీతిలో ప్రవర్తించేలా కనబడుతున్నారు. సుశాంత్ సింగ్ మరణానికి నెపోటిజం కారణమా? లేదంటే రియా చక్రవర్తి కారణమా? అనేది తెలిసేవరకు సుశాంత్ సింగ్ అభిమానుల తీరు అలానే ఉంటుంది. మరి సుశాంత్ సింగ్ రాజపుత్ అభిమానులు ఆగ్రహ జ్వాలలో ఇలా ఎవ్వరైనా మాడి మసైపోవాల్సిందే అంటుంటే.. బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం ఈ కేసులో మరింత వేడిని రాజేసింది.

Nepotism effect on Ananya Pandey New movie:

One More Heroine faces Problems with Nepotism

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ