Advertisementt

చరణ్ ఓకే అంటే.. అదెంతసేపు..?

Sat 29th Aug 2020 12:12 AM
ram charan,dream,mega power star,sports backdrop film  చరణ్ ఓకే అంటే.. అదెంతసేపు..?
Ram Charan Talks about his Dream Project చరణ్ ఓకే అంటే.. అదెంతసేపు..?
Advertisement
Ads by CJ

స్టార్ హీరోస్ అనుకోవాలే గానీ.. స్టార్ డైరెక్టర్స్ వాళ్ళ కోరికని తీర్చేస్తారు. అయితే వాళ్ళ కలకు సరిపోయే కథ తగిలితేనే హీరోలు సినిమాలు ఒప్పుకుంటారు. ప్రస్తుతం హీరోలంతా నెక్స్ట్ సినిమాలకు కమిట్ అవడం.. గ్రాండ్‌గా ప్రకటించడం చేస్తున్నారు. ఎన్టీఆర్ RRR తర్వాత త్రివిక్రమ్‌కి, ప్రభాస్ రాధేశ్యామ్ తర్వాత రెండు సినిమాలు, అల్లు అర్జున్ పుష్ప తర్వాత కొరటాలతో మూవీలను ప్రకటించారు. మహేష్ అయితే సర్కారు వారి పాట తర్వాత రాజమౌళితో సినిమా అని ఫిక్స్ అయ్యాడు. కానీ రామ్ చరణ్ RRR, ఆచార్య ల తర్వాత కొత్త సినిమా ప్రకటించలేదు.

అయితే తాజాగా రామ్ చరణ్ తనకి డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉందని చెబుతున్నాడు. తనకి స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్‌లో ఓ సినిమా చేయాలనేది కల అంటున్నాడు. అయితే గతంలో ఆర్బీ చౌదరి బ్యానర్లో స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న కథతో మెరుపు అనే సినిమాను స్టార్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అదిగో అప్పటి నుంచీ స్పోర్ట్స్ నేపథ్యంలో ఆసక్తికరంగా సాగే ఒక కథ కోసం ఎదురు చూస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు నచ్చిన మెచ్చిన స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ ఉన్న కథ దొరకలేదు. నన్ను టెంప్ట్ చేసే స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా నా డ్రీం ప్రాజెక్ట్ మొదలు పెడతానంటున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ చెప్పాలే కానీ.. దర్శకులు స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ ఉన్న కథలను ఎన్ని తయారు చెయ్యరు. అంతేగా..?

Ram Charan Talks about his Dream Project:

Ram Charan wants sports Backdrop Film 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ