Advertisementt

అర్జున్ రెడ్డి మళ్ళీ రిలీజ్.. ఎప్పుడంటే..

Thu 27th Aug 2020 12:11 PM
arjun reddy,vijay devarakonda,sandeep reddy vanga,kabir singh  అర్జున్ రెడ్డి మళ్ళీ రిలీజ్.. ఎప్పుడంటే..
Arjun Reddy theatrical release again.. అర్జున్ రెడ్డి మళ్ళీ రిలీజ్.. ఎప్పుడంటే..
Advertisement
Ads by CJ

అర్జున్ రెడ్డి సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ గా నిలిచిన ఈ చిత్రం వచ్చి ఇప్పటికి మూడేళ్ళు అవుతుంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి యూత్ లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దర్శకుడు సందీప్ వంగా కి ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. ఈ సినిమాతో రాహుల్ రామక్రిష్ణ వెలుగులోకి వచ్చాడు. తెలుగులో సంౘలనం సృష్టించిన ఈ చిత్రం హిందీ, తమిళంలోకి కూడా వెళ్ళింది. 

హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ కూడా ప్రభంజనం సృష్టించింది. హిందీ రీమేక్ కి కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహించాడు. ఐతే ఈ చిత్రం రిలీజై మూడేళ్లయిన సందర్భంగా ఒకానొక మీడియా ఛానెల్ తో మాట్లాడిన దర్శకుడు సందీప్ వంగా ఈ చిత్రాన్ని మళ్ళీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట.

మరో రెండేళ్ళు పూర్తయితే అర్జున్ రెడ్డి రిలీజై ఐదు సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా అర్జున్ రెడ్డి సినిమాని మరోసారి థియేట్రికల్ రిలీజ్ చేస్తారట. అంటే మరోసారి అర్జున్ రెడ్డి చిత్రాన్ని థియేటర్లో చూసే అవకాశం ఉందన్నమాట. థియేటర్లో చూడలేకపోయాం అనుకున్నవాళ్లకి మంచి అవకాశం..

Arjun Reddy theatrical release again..:

Arjun Reddy theatrical release again..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ