Advertisementt

ఆ యాంకర్ సినిమా ఓటీటీలోకే..?

Thu 27th Aug 2020 11:49 AM
srimukhi,anchor srimikhi,its time to party,gowtham kvs,telugu  ఆ యాంకర్ సినిమా ఓటీటీలోకే..?
Crazy Anchor Movie comes to OTT..? ఆ యాంకర్ సినిమా ఓటీటీలోకే..?
Advertisement
Ads by CJ

లాక్ డౌన్ ప్రభావం అందరి మీదా ఉంది. అంతకుముందు అనుకున్న ప్లాన్లన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. సినిమా వారికైతే లాక్ డౌన్ చేసిన నష్టం అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ లు ఆగిపోయి, షూటింగులు నిలిచిపోయి చాలా నష్టం కలిగింది. ఇంకా థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్న సినిమాలని తప్పని పరిస్థితుల్లో ఓటీటీలకి అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు ఓటీటీ ద్వారా పలకరించాయి.

తాజాగా క్రేజీ యాంకర్ శ్రీముఖి నటించిన ఇట్స్ టై టు పార్టీ చిత్రం ఓటీటీలో విడుదలవబోతుందని అంటున్నారు. చిన్న చిన్న పాత్రల ద్వారా పరిచయమైన శ్రీముఖి అటు యాంకర్ గా బిజీగా ఉంటూ సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది. బిగ్ బాస్ మూడవ సీజన్ రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ పరంగానే తాను లీడ్ రోల్ లో చేసిన ఇట్స్ టైమ్ టు పార్టీ చిత్రం మంచిపేరు తీసుకొస్తుందని భావించింది.

కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై అధికారిక సమాచారం బయటకి రానప్పటికీ వార్తలు మాత్రం పుట్టుకొస్తున్నాయి. ఇట్స్ టైమ్ టు పార్టీ చిత్రాన్ని గౌతమ్ కేవీఎస్ దర్శకత్వం వహించారు. బులితెర ప్రేక్షకులకి బాగా పరిచయమైన శ్రీముఖి సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే మరింత మంది ప్రేక్షకులకి చేరువయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. చూడాలి మరేం జరుగుతుందో..!

Crazy Anchor Movie comes to OTT..?:

Crazy Anchor Movie comes to OTT..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ