Advertisementt

నాని వి ట్రైలర్ లో ఆమె ఎక్కడ...?

Thu 27th Aug 2020 08:18 AM
nani,v the movie,aditi rao hydari,nivetha thomas  నాని వి ట్రైలర్ లో ఆమె ఎక్కడ...?
Where is Aditi Rao In V Trailer నాని వి ట్రైలర్ లో ఆమె ఎక్కడ...?
Advertisement
Ads by CJ

అష్టాచమ్మా సినిమాతో నాని ని తెలుగు తెరకి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనక్రిష్ణ, ఇప్పటివరకు నానితో మూడు సినిమాలు చేసాడు. అష్టా చమ్మా, జెంటిల్ మేన్, వి. కరోనా కారణంగా వి చిత్రం ఓటీటీలో విడుదల అవుతోంది. మార్చి 25వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం థియేటర్లు తెరుచుకోని కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఐదు నెలలు గడుస్తున్నా థియేటర్లు తెరుచుకుంటాయన్న నమ్మకం లేకపోవడంతో ఓటీటీలోకి సెప్టెంనర్ 5వ తేదీన వచ్చేస్తోంది.

జెంటిల్ మేన్ సినిమా తరహాలోనే వి చిత్రం కూడా థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది. ఇందులో నాని నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడు. సుధీర్ బాబు మరో హీరోగా కనిపించను ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. అంచనాలకి తగ్గట్టుగానే ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఐతే ఈ ట్రైలర్ లో సుధీర్ బాబు జోడీగా నివేథా థామస్ కనిపించింది. కానీ నాని జోడీ అదితీ రావ్ హైదరీని మాత్రం దాచేసారు. 

ఒక నిమిషం 45సెకన్ల ట్రైలర్ లో ఎక్కడా అదితీ కనిపించలేదు. ఐతే అదితీని కావాలనే చూపించలేదని అర్థం అవుతుంది. సినిమాలో తన పాత్ర చాలా కీలకంగా ఉండనుందట. సినిమాలో ట్విస్ట్ ఆమె ద్వారానే రివీల్ అవుతుందని అంటున్నారు. అందువల్లే ఆమెని అలా దాచి ఉంచారని చెబుతున్నారు. ఏదైతేనేం ఎక్స్ పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఉన్న ట్రైలర్ సినిమా పట్ల ఆసక్తిని ఇంకా పెంచుతోంది.

Where is Aditi Rao In V Trailer:

Where is Aditi Rao In V Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ