Advertisementt

అమెజాన్ వారికి షాకిచ్చిన ‘వి’ ట్రైలర్..!

Thu 27th Aug 2020 06:53 PM
amazon prime video,v trailer,nani,sudheer babu,v movie  అమెజాన్ వారికి షాకిచ్చిన ‘వి’ ట్రైలర్..!
V Trailer gives shock to Amazon prime Video అమెజాన్ వారికి షాకిచ్చిన ‘వి’ ట్రైలర్..!
Advertisement
Ads by CJ

థియేటర్స్ ఓపెన్ అవుతాయన్న ప్రచారం మొదలైన టైంలో వి సినిమాని అమెజాన్ కి అమ్మేసారు నాని అండ్ కో. సెప్టెంబర్ 5న నాని వి అమెజాన్ లో ప్రసారం కాబోతుంది. అయితే వి సినిమాని ఓటిటికి అమ్మేశాక వి ప్రమోషన్స్ ని కాస్త కొత్తగా చేపట్టింది వి టీం. నాని అమెజాన్‌కి వి సినిమాని అమ్మేశారనే విషయాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా పంచుకున్నాడు. ఇక తాజాగా వి ట్రైలర్ ని కొత్తగా సరికొత్తగా విడుదల ప్లాన్ చేసారు. కాకపోతే ఓటిటీనే చాలామందికి కొత్త అనుకుంటే ఇప్పుడు వి ట్రైలర్ ని అమెజాన్ ప్రైమ్ వారు మరీ కొత్తగా విడుదల ఏర్పాట్లు చేసారు. బిసి సెంటర్స్ వారికి అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటివి చాలామందికి తెలియదు. అలాంటిది ట్రైలర్ కోసం ఓ తతంగం చెయ్యాలంటే వాళ్ళ వల్ల కాదు.

కానీ ఏదో కొత్తగా చేద్దామనుకున్న అమెజాన్ ప్రైమ్... వి ట్రైలర్ ని చూడాల‌నుకునేవాళ్లు అమెజాన్ సైట్ లోకి వెళ్లి... యూసర్ నేమ్, పాస్ వర్డ్ తో లాగిన్ అయ్యి, అందులో ఓ ఫొటో అప్ లోడ్ చేస్తే వి ట్రైల‌ర్ చూసేలా ప్లాన్ చేసింది. కానీ ఈ ప్లాన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓ ట్రైలర్ ని యూట్యూబ్ లో చూడడానికి ఇంత తతంగం అవసరమా అంటున్నారు నెటిజెన్లు. కొంతమంది ఈ అమెజాన్ పెట్టిన ప్రొసీజర్ అంతా పూర్తి చేసుకుని ట్రైలర్ చూడడానికి ప్రిపేర్ అయినప్పటికీ.. వి ట్రైలర్ ప్లే కాకపోయేసరికి చిర్రెత్తుకొచ్చి వి ట్రైలర్ పై, అమెజాన్ ఐడియా పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ట్రైలర్ చూపించడానికి ఇంత బిల్డప్ ఇచ్చిన వారు సినిమా చూపించడానికి ఇంకెంత బిల్డప్ ఇస్తారో అంటూ సెటైర్స్ వేస్తున్నారు. మరి వి సినిమాని కొత్తగా ప్రమోట్ చేద్దామనుకున్న అమెజాన్ వారికి ఇప్పుడు గట్టిగానే షాక్ తగిలింది.

V Trailer gives shock to Amazon prime Video:

Amazon Prime Video Plan failed on V Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ