Advertisementt

కేజీఎఫ్ లోకి ప్రకాష్ రాజ్ అడుగు...

Wed 26th Aug 2020 06:43 PM
kgf,kgf2,prakash raj,prashant neel,yash  కేజీఎఫ్ లోకి ప్రకాష్ రాజ్ అడుగు...
Prakash Raj In KGF 2.. కేజీఎఫ్ లోకి ప్రకాష్ రాజ్ అడుగు...
Advertisement
Ads by CJ

కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన కేజీఎఫ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలెలాంటి సందడి లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. హీరో ఎలివేషన్స్, అమ్మ సెంటిమెంట్, ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఈ సినిమాని శిఖరాగ్రాన నిలిపాయి. ఐతే మొదటి అధ్యాయం పూర్తయ్యాక రెండవ అధ్యాయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కరోనా లేకపోయుంటే ఈ పాటికి చిత్రీకరణ పూర్తయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉండేది. కానీ ఆరు నెలలపాటు షూటింగ్ లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ మళ్ళీ మొదలైంది. ఐతే ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది. కేజీఎఫ్ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నాడు. ఈ మేరకు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

ప్రకాష్ రాజ్ కి సీన్ వివరిస్తున్న ప్రశాంత్ నీల్, ఆ ఫోటోలని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు. మొదటి అధ్యాయంలో అందరూ కన్నడ పరిశ్రమకి చెందిన వారే ఉండగా, రెండవ అధ్యాయంలో మాత్రం పాన్ ఇండియా అప్పీల్ కనిపించేందుకు అన్ని భాషల వారిని తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి పాత్రలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కనిపించనుందట. ఇక విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Prakash Raj In KGF 2..:

Prakash Raj In KGF 2..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ