Advertisementt

మహేష్ మళ్ళీ ఆ దర్శకుడికి అవకాశం ఇస్తాడా..?

Wed 26th Aug 2020 09:08 AM
mahesh babu,murugadoss,rajamouli,rrr  మహేష్ మళ్ళీ ఆ దర్శకుడికి అవకాశం ఇస్తాడా..?
Will Mahesh give a Chance to.. మహేష్ మళ్ళీ ఆ దర్శకుడికి అవకాశం ఇస్తాడా..?
Advertisement
Ads by CJ

సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు, గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా ప్రకటించాడు. కోవిడ్ కారణంగా ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. మాస్ అంశాలతో పాటు మహేష్ ని అల్ట్రా స్టైలిష్ గా చూపించబోతున్నానని చిత్ర దర్శకుడు పరశురామ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా అనంతరం మహేష్ బాబు ఎవరితో చేస్తాడనేది ఆసక్తిగా మారింది. రాజమౌళితో మహేష్ సినిమా ఉంటుందని తెలిసినప్పటికీ, ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడప్పుడే పూర్తయ్యేలా కనిపించట్లేదు.

సో.. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేసుకుని మహేష్ దగ్గరికి వచ్చేలోపు మహేష్ మరో సినిమా చేసే అవకాశం కనిపిస్తుంది. అందుకని మహేష్ సినిమా ఎవరితో ఉంటుందనే విషయమై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మహేష్ మురుగదాస్ తో చేతులు కలపబోతున్నాడని అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇద వరకే స్పైడర్ సినిమా వచ్చింది. స్పైడర్ తెలుగు ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది.

మరి తనకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో మళ్ళీ సినిమా ఒప్పుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ మంచి ఫామ్ లో ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. వరుస విజయాలతో టప్ గేర్ లో ఉన్నాడు. ఇప్పుడు చేస్తున్న సర్కారు వారి పాట పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో మురుగదాస్ తో సినిమా చేస్తాడా అనేది చూడాలి.

Will Mahesh give a Chance to..:

Will Mahesh give a Chance to..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ