Advertisementt

అనిల్ రావిపూడి ఇప్పుడేం చేస్తాడో..?

Wed 26th Aug 2020 11:23 PM
anil ravipudi,f3,venkatesh,statement,varun tej  అనిల్ రావిపూడి ఇప్పుడేం చేస్తాడో..?
Victory Venkatesh Gives Clarity about F3 Movie అనిల్ రావిపూడి ఇప్పుడేం చేస్తాడో..?
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి.. వెంకటేష్ - వరుణ్ తేజ్‌లతో తెరకెక్కించిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. దిల్ రాజు దానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 చెయ్యడానికి రెడీ అయ్యాడు. అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఎఫ్ 3 స్క్రిప్ట్ రెడీ చేస్తే వెంకీ - వరుణ్‌ల డేట్స్ తీసుకుందామని దిల్ రాజు చెప్పడంతో అనిల్ రావిపూడి కూడా సరిలేరు తర్వాత మరో కథ రాయకుండా ఎఫ్ 3 స్క్రిప్ట్‌ని ప్రిపేర్ చేస్తున్నాడు. కానీ వెంకటేష్ - వరుణ్ తేజ్‌లు కొత్త సినిమాలతో బిజీ అయ్యారు. మధ్యలో కరోనా ఒకటి అనిల్ ఆశల మీద నీళ్లు చల్లింది. అయితే వెంకీ - వరుణ్‌లు సినిమాలతో బిజీ కాబట్టి అనిల్ కూడా ఎఫ్ 3 కన్నా ముందు మరో యంగ్ హీరోతో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.

 

తాజాగా వెంకటేష్ ఇచ్చిన క్లారిటీతో అనిల్ రావిపూడి అయోమయంలో పడ్డాడని అంటున్నారు. రానా పెళ్ళిలో హడావిడి చేసిన వెంకటేష్ కరోనా కారణంగా షూటింగ్‌లకి హాజరవడం లేదు. తాజాగా ఆయన ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 పై మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎఫ్ 3 చేసే అవకాశం లేదని తేల్చేశాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్నవి షూటింగ్స్ కంప్లీట్ చేశాకే ఎఫ్ 3 అని చెప్పాడు. ఇక తన కొత్త చిత్రాలను సంక్రాంతి అనంతరమే సెట్స్ పైకి వెళ్ళతాయని వెంకీ స్పష్టం చెయ్యడంతో ఇప్పుడు అనిల్ రావిపూడి అయోమయంలోకి వెళ్లిపోయాడని టాక్ వినబడుతుంది. మరి వెంకీ - వరుణ్ లు ఫ్రీ అయ్యేలోపు అనిల్ రావిపూడి ఈ గ్యాప్ లో మరో సినిమా చేసినా చేయవచ్చు అని అంటున్నారు. 

Victory Venkatesh Gives Clarity about F3 Movie:

Anil Ravipudi in Full Confusion with Venkatesh statement

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ