Advertisementt

ప్రభాస్ కాదంటే ‘ఆదిపురుష్’ లేదు: ఓంరౌత్

Wed 26th Aug 2020 11:03 PM
prabhas,om raut,adipurush,bollywood film  ప్రభాస్ కాదంటే ‘ఆదిపురుష్’ లేదు: ఓంరౌత్
OM raut talks about Adipurush Movie ప్రభాస్ కాదంటే ‘ఆదిపురుష్’ లేదు: ఓంరౌత్
Advertisement
Ads by CJ

ప్రభాస్‌తో ఆదిపురుష్ సినిమాని ప్రకటించి ఓం రౌత్ అందరికి షాకివ్వలేదు కానీ.. ఓం రౌత్‌తో ప్రభాస్ సినిమా అనగానే బాలీవుడ్ హీరోలే షాకయ్యారు. తానాజీ సెట్స్ పైకి వెళ్ళకముందు నుండే ఆదిపురుష్ గురించిన ఆలోచనలు దర్శకుడు ఓం రౌత్‌లో ఉన్నాయట. ఆ విషయాన్నే ఆయనే స్వయంగా చెబుతున్నాడు. ఈ సినిమా విషయంలో చాలా పరిశోధన చేశాను అని... రఫ్‌గా ఓ డ్రాఫ్ట్ తయారు చేసుకున్నాకే నా టీమ్‌కి ఆదిపురుష్ కథ వినిపించగా.. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అంటున్నాడు ఓం రౌత్. ఈ సినిమా కథ ప్రభు రామ్ కథ అని.. ఇతిహాసగాధలో ఓ భాగం అని... చారిత్రక కోణం నుండి ఇప్పటికే దీనిపై పరిశోధనలు పూర్తి చేశామని చెబుతున్నాడు దర్శకుడు ఓం.

ఇక ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్‌ప్లే అప్‌డేట్ కూడా అయ్యిందని... కథావస్తువులో మార్పులు లేనప్పటికీ.. దాన్ని తీర్చి దిద్దే విధానం నేటి పరిస్థితులకి కొత్తగా ఉంటుంది. భారీ బడ్జెట్‌తో 3D లో రూపొందుతున్న ఈ సినిమాకి ప్రభాస్‌నే హీరోగా ఎందుకు ఎంపిక చేసారు అని దర్శకుడిని అడిగితే.. దానికి ఆయన ఏం చెప్పాడో తెలుసా?. ప్రభాస్ మాత్రమే ఈ సినిమాకి, ఈ పాత్రకి సరిపోతాడని నాకు అనిపించింది. బాహుబలిగా ప్రభాస్ ఆహార్యం, ఆయన పర్సనాలిటీ, ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆయన చూపు, నిలబడే విధానం, నడిచే తీరు అలా ఆదిపురుష్ పాత్రలో ప్రభాస్‌నే ఊహించుకున్నాను. ఒకవేళ ప్రభాస్ ఒప్పుకోకపోతే నేను అసలు ఈ ఆదిపురుష్ సినిమాని చేసే వాడినే కాదు అంటున్నాడు ఓం. 

ఇక ఆదిపురుష్‌లో రాముడిని ఎలా చూపించబోతున్నారని అడగగా.. ఇప్పుడిప్పుడే మాట్లాడితే అది తొందరపాటు అవుతుంది అంటూ తప్పించుకున్నాడు. ఏం మాట్లాడినా అది ఈ టైం లో కాంట్రవర్సీ అవుతుందని ఓం కి బాగా తెలుసు. అందుకే అలా తప్పించుకున్నాడు. 

OM raut talks about Adipurush Movie:

Prabhas is aiming for the physique of an archer says Om raut

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ