చాలామంది హీరో, హీరోయిన్స్ కి సినిమాల్లోకి వచ్చినప్పుడు వరసగా అవకాశాలు వస్తే.. అబ్బ వాళ్లకి లక్కు, అదృష్టం బాగా ఉంది అందుకే సినిమా ఇండస్ట్రీలో వరస అవకాశాలు అంటారు. అదే అవకాశాలు లేక ఒకటి రెండు సినిమాలకే ఖాళీగా ఉంటే.. ఐరెన్ లెగ్ ముద్ర వేస్తారు. ఇది సినిమా పరిశ్రమలో సహజంగా జరిగేవే. అయితే ఈమధ్యన అందం, ఆకర్షణ పెద్దగా లేని రష్మిక మందన్నకి వరస ఆఫర్స్ రావడం, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో లక్కీ హీరోయిన్ రష్మికకి అదృష్టం బాగా ఉంది అందుకే వరస ఆఫర్స్ వస్తున్నాయని అంటున్నారు. కాజల్, సమంత, తమన్నా, అనుష్క ఎవరైనా అదృష్టం ఉండబట్టే నిలదొక్కుకున్నారని అంటారు.
కానీ సినిమాల్లో స్టార్ డమ్ రావడానికి కేవలం అదృష్టం ఒకటే అంటే ఒప్ప్పుకొను అంటుంది కాజల్ అగర్వాల్. కృషి, పట్టుదల లేకుండా వచ్చిన ఏ విజయమైనా ఆత్మతృప్తి ఉండదు. అందుకే ఎవరైనా వచ్చి అదృష్టం ఒక్కటే విజయానికి మార్గం అంటూ చెప్పే కబుర్లు నమ్మొద్దు అని చెబుతుంది కాజల్. అసలెందుకు నన్ను చాలామంది అడుగుతుంటారు.. మీరు సినిమాల్లోకి వచ్చాక అదృష్టం అనే మాటకి ఎంత విలువనిస్తారు అని.. నిజం చెప్పాలంటే నా సినిమా కెరీర్‌లో అదృష్టం అనే పదానికి చోటు ఉండి ఉండొచ్చు.. కానీ నా స్టార్ డమ్ మొత్తం అదృష్టం మీదే వచ్చింది అంటే నేను నమ్మను.
అలాగే నేను ఒప్పుకోను. సినిమా అవకాశాలు రావడం అదృష్టం వల్ల కావొచ్చేమో కానీ.. తర్వాత కెరీర్‌లో నేను టాప్ పొజిషన్‌కి చేరిన క్రమం మొత్తం నా కష్టమే అని చెబుతుంది. నేను కష్టపడి చేసిన పాత్రల వలనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. అదే నన్ను ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఏదైనా అదృష్టం ఒకటే ఉంటే సరిపోదు.. మనం కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అంటూ అదృష్టం పై ఓ స్పీచ్ ఇచ్చింది కాజల్ అగర్వాల్.