Advertisementt

అప్పుడు బాలయ్య అన్నారు.. ఇప్పుడు నాగార్జున అంటున్నారు..

Mon 24th Aug 2020 09:06 PM
puri jagannadh,nagarjuna,balayya,vijay devarakonda,fighter  అప్పుడు బాలయ్య అన్నారు.. ఇప్పుడు నాగార్జున అంటున్నారు..
Puri Jagannadh next movie with.. అప్పుడు బాలయ్య అన్నారు.. ఇప్పుడు నాగార్జున అంటున్నారు..
Advertisement
Ads by CJ

హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు అందుకోవడంలో పూరి జగన్నాథ్ ని మించిన వారు లేరు. తన మాటలతో హీరోయిజాన్ని పీక్స్ లో చూపించే దర్శకుడు పూరీనే. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ మూవీ చేస్తున్నాడు. కరోనా లేకపోయుంటే ఈ చిత్రం ఈ పాటికి విడుదలై ఉండేది. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకుంటోంది.

ఐతే ఫైటర్ తర్వాత పూరి జగన్నాథ్ ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఆసక్తిగా మారింది. ఈ విషయమై సొషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటికి మొన్న బాలయ్యతో సినిమా ఉంటుందని, పైసా వసూల్ చిత్రంతో నిరాశపర్చిన పూరీ, ఈ సారి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని, బాలయ్య కూడా ఓకే అన్నాడని అన్నారు. తాజాగా నాగార్జునతో పూరీ సినిమా ఉంటుందని అంటున్నారు.

శివమణి, సూపర్ చిత్రాల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలవలేదు. కలిస్తే బాగుంటుందని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ వీరిద్దరి కాంబో గురించి వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు  వస్తున్న వార్తల ప్రకారం నాగార్జునతో సినిమా చేస్తాడా లేదా బాలయ్యతో సినిమా మొదలెడతాడా చూడాలి. కాకపోతే ఏ నిర్ణయమైనా ఫైటర్ చిత్ర ఫలితం తర్వాతే ఉండే అవకాశం కనిపిస్తుంది.

Puri Jagannadh next movie with..:

Puri Jagannadh next movie with..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ