నాని - దిల్ రాజు కాస్త బెట్టు చేసినా చివరికి ఓటిటి వలలో పడ్డారు. నాని వి సినిమాని అమెజాన్ ప్రైమ్ వారు భారీ ధరకు కొనేశారు. థియేటర్స్ ఓపెన్ అయినా ప్రేక్షకులు ఇప్పుడప్పుడే రారు కాబట్టి వి సినిమాని డిజిటల్ ప్రైమ్ కి అమ్మేసారు దిల్ రాజు వాళ్ళు. దిల్ రాజు లెక్కలు వేసి వేసి చివరికి ఓటిటి బాట పట్టారు. సెప్టెంబర్ 5న వి సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. అయితే నాని వెళితే వెళ్ళాడు నేను వెళ్ళను అని ఖచ్చితంగా చెబుతున్నాడు ఓ టాలీవుడ్ హీరో. ఆ హీరో ఎవరో కాదు ‘రెడ్’ మూవీ హీరో రామ్ పోతినేని.
‘వి’ సినిమానే కాదు.. రామ్ ‘రెడ్’ సినిమాని ఓటిటి వాళ్లు చేజిక్కించుకోవడానికి చేయని ప్రయత్నాలు లేవు. స్రవంతి రవికిషోర్ నిర్మించిన రెడ్ సినిమాని కిషోర్ తిరుమల తెరకెక్కించాడు. రెడ్ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ తడమ్‌కు రీమేక్‌గా గా తెరకెక్కింది. మార్చ్ లో థియేటర్స్ మూత పడినప్పటినుండి రామ్ మాత్రం నెను రెడ్ సినిమాని ఓటిటికి అమ్మను థియేటర్స్ లోనే విడుదల చేస్తా అంటున్నాడు. ఇప్పుడు కూడా వారు ఓటిటి ఆఫర్స్ కి పడిపోయినా నేను పడను అంటున్నాడట. ఎందుకంటే ఓన్ బ్యానర్ కాబట్టి కొన్ని రోజులు వేచి చూసి థియేటర్స్ లోనే విడుదల చేసినా నష్టం ఉండదు. కానీ నాని సినిమా అలా కాదుగా.. అందుకే ఓటిటికి అంగీకరించాడు.