రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. నిజ జీవిత పాత్రలని తీసుకుని కల్పిత కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ చేస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. ఐతే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ ఆల్రెడీ విడుదలైంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెసెన్స్ తో వీడియో అదరగొట్టేసింది.
రామ్ చరణ్ వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఎన్టీఆర్ లుక్ పై అంచనాలు ఇంకా పెరిగాయి. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. కరోనా లేకపోయుంటే ఈ పాటికి ఎన్టీఆర్ లుక్ బయటకి వచ్చేది. ఇప్పటికీ ఎన్టీఆర్ లుక్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా వెయిట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ విషయమై రాజమౌళి అప్డేట్ ఇచ్చాడు. ఇటీవలే కరోనా నుండి కోలుకున్న రాజమౌళీ, ఒకానొక ఇంటర్వ్యూలో ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ గురించి మాట్లాడాడు.
హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి ఎలా ఉందనే తదితర విషయాలు నిపుణులతో మాట్లాడుతున్నారట. వారి సూచించిన సూచనల ప్రకారం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఉంటుందట. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఎలాంటి షూటింగ్ పెట్టుకోవట్లేదట. మరో పదిహేను రోజుల పాటు చూసుకుని ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారట. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయితే ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ షాట్స్ చిత్రీకరిస్తారట. అవి తీయడానికి కనీసం పదిహేను రోజుల సమయమైనా పడుతుందట. అంటే తారక్ టీజర్ రావాలంటే దాదాపుగా నెలన్నర సమయం పట్టవచ్చు. చూడాలి మరి అప్పటి వరకు ఎలా ఉంటుందో..