దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ పై అభిమానుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ లుక్ రిలీజ్ అయినప్పటినుండి అంచనాలు మరింత పెరిగాయి. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ మళ్లీ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో తెలియదు.
ఐతే కరోనా వచ్చి అంతకుముందు ప్లాన్స్ అన్నింటినీ మార్చివేసింది. దాంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో చాలా మార్పులు రానున్నాయట. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ కి జోడీగా కనిపించనుందని తెలిసిందే. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు గనక ఆలియా ఆర్ ఆర్ ఆర్ నుండి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయట. బాలీవుడ్ లో ఆలియా బిజీ హీరోయిన్. ఇప్పటికే ఆమె చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి.
సో.. ఆర్ ఆర్ ఆర్ కి టైమ్ కేటాయించడం కష్టమే. ఐతే ఒకవేళ ఆలియా తప్పుకుంటే ఆమె స్థానంలో ప్రియాంకా చోప్రాని తీసుకోవాలని చూస్తున్నారట. గతంలో రామ్ చరణ్ సరసన తుఫాన్ సినిమాలో ప్రియాంక కనిపించింది. ఈ విషయమై అధికారిక సమాచారం రానప్పటికీ ఫిలిమ్ నగర్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.