Advertisementt

ప్యాన్ ఇండియా లెవెల్‌లో విజయ్‌కి 3వ స్థానం

Sun 23rd Aug 2020 08:21 AM
vijay deverakonda,ranke three,india,most desirable man,pan india star,rowdy star  ప్యాన్ ఇండియా లెవెల్‌లో విజయ్‌కి 3వ స్థానం
Rowdy Star Vijay Deverakonda is third Most Desirable Dude in India ప్యాన్ ఇండియా లెవెల్‌లో విజయ్‌కి 3వ స్థానం
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ డిజైరబుల్‌మెన్ లిస్ట్‌లో 3వ స్థానం దక్కించుకున్న విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్‌లో అతనికున్న ఫాలోయింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. తెలుగులోనే కాదు నేషనల్ లెవల్‌లో కూడా విజయ్ సత్తా చాటుతున్నాడు. రీసెంట్‌గా ఇన్‌స్టా‌గ్రమ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ దక్కించుకున్న ఫస్ట్ సౌత్ హీరోగా రికార్డు కొట్టిన విజయ్.. ఇప్పుడు మరో మైలురాయి అందుకున్నాడు. ఇండియాలోని టాప్ 50 మోస్ట్ డిజైరబుల్‌మెన్‌ల లిస్ట్‌లో విజయ్ ఏకంగా మూడవ స్థానం దక్కించుకోవడం విశేషం. మొదటి స్థానంలో షాహిద్ కపూర్, రెండో స్థానంలో రణ్ వీర్ సింగ్ ఉండగా మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్ మూడో స్థానం సొంతం చేసుకున్నాడు.

ఇంతకుముందు హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్‌మెన్‌గా వరుసగా 2018, 2019 సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న రౌడీ స్టార్ ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్‌లో టాప్ 3 ప్లేస్ కైవసం చేసుకోవటం అతని క్రేజ్‌కు నిదర్శనం. అతను చేసిన సినిమాలకు, తన అటిట్యూడ్‌కు నేషనల్ వైడ్‌గా ఫ్యాన్స్ అవుతున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Rowdy Star Vijay Deverakonda is third Most Desirable Dude in India:

Vijay Deverakonda has now been ranked three in India’s Most Desirable Dudes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ