కరోనా లాక్‌డౌన్ మొదలయ్యింది.. సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. స్టార్ హీరోలే కాదు... చిన్న నటులు అంతా ఇళ్లకే పరిమితమై పోయారు. అయితే స్టార్ హీరోలు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటే.. సందీప్ వంగా మాత్రం బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ అంటూ ఇంటిని క్లీన్ చేస్తూ వంట చేస్తూ ఆ ఛాలెంజ్ ని రాజమౌళికి విసిరాడు. రాజమౌళి దగ్గరనుండి రామ్ చరణ్, చిరు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ నుండి జర్నలిస్ట్ ల వరకు ఆ బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్‌లో కొట్టుకుపోయారు. ఇంతలోపులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటూ స్టార్ హీరోల దగ్గరనుండి కమెడియన్స్ వరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తమ పెరటిలోనే చెట్లు నాటారు. అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు సమంత విసిరిన ఛాలెంజ్ మాత్రం మామూలుది కాదు.
సమంత లాక్‌డౌన్‌లో మిద్దె మీద వ్యవసాయం చేస్తుంది. కూరగాయలు, ఆకు కూరలు ఇలా చాలా వెరైటీస్ అన్ని పండిస్తోంది. పోషక విలువలున్న మొక్కలు పెంచుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోమంటూ చెబుతుంది. తాజాగా సమంత గ్రో విత్ మీ అనే ఛాలెంజ్ స్టార్ట్ చేసింది. ఆరోగ్యానికి అవసరమైన ఆహారాన్ని ఎవరికీ వారే పండించుకోవాలని.. సమంత చెబుతుంది. మరిన్ని వారాల పాటు మన ఆహారాన్ని మనమే పండించుకుందాం. ఒక కుండీ, లేదా ఖాళీ పాల పాకెట్, కొద్దిగా మట్టి, విత్తనాలు ఉన్నా సరే.. అంటూ గ్రో విత్ మీ ఛాలెంజ్ ని మంచు లక్ష్మికి, రకుల్ ప్రీత్ సింగ్ కి విసిరింది. మరి సమంత విసిరిన ఛాలెంజ్ ని రకుల్, మంచు లక్ష్మి పాటించి మళ్లీ ఎవరికీ విసురుతారో చూడాలి.