Advertisementt

నాని వి బాలీవుడ్ కి వెళ్లనుందా..?

Fri 21st Aug 2020 09:27 AM
nani,v the movie,dil raju,indraganti monahan krishna,aditi rao hydari,nivetha thomas  నాని వి బాలీవుడ్ కి వెళ్లనుందా..?
Will Nani V movie going to Bollywood..? నాని వి బాలీవుడ్ కి వెళ్లనుందా..?
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా తెలుగు చిత్రాలకి బాలీవుడ్ లో మంచి గిరాకీ ఏర్పడింది. ఇక్కడ విజయం సాధించిన చిత్రాల రీమేక్ హక్కుల కోసం బాలీవుడ్ నిర్మాతలు ఎగబడుతున్నారు. సింబా, కబీర్ సింగ్ చిత్రాలు విజయవంతం కావడంతో తెలుగు సినిమా పట్ల ఆసక్తి బాగా పెరిగింది. ఐతే టాలీవుడ్ నిర్మాతలు కూడా రీమేక్ లలో భాగం పంచుకుంటున్నారు. తాజాగా దిల్ రాజు, విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాని బాలీవుడ్ లో నిర్మించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా దిల్ రాజు, మరో టాలీవుడ్ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారట. నాని హీరోగా ఇంద్రగంటి మోహన క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వి చిత్రాన్ని బాలీవుడ్ తెరమీదకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. థియేటర్లు ఇంకా తెరుచుకోని కారణంగా వి చిత్రం, అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబరు 5వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవనుంది.  ఇందులో నాని నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడట.

వి సినిమాపై బాగా నమ్మకం పెట్టుకున్న దిల్ రాజు బాలీవుడ్ లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడట. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లోని నిర్మాతగా అడుగు పెడుతున్న దిల్ రాజు, వి చిత్రం ద్వారా దాన్ని కొనసాగించాలని చూస్తున్నాడట.  ఐతే ఆల్రెడీ ఓటీటీలో రిలీజైన చిత్రాన్ని భాషాభేదం లేకుండా అన్ని భాషల వారు చూసేస్తున్న ప్రస్తుత సమయంలో రీమేక్ ఎలా వర్కవుట్ అవుతుందనేది వారికే తెలియాలి. ఈ విషయమై అధికారిక సమాచారం వస్తుందేమో చూడాలి.

Will Nani V movie going to Bollywood..?:

Will Nani V movie going to Bollywood..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ