Advertisementt

థ్యాంక్యూ సినిమాలో చైతన్య పాత్రపై క్రేజీ అప్డేట్..

Fri 21st Aug 2020 09:04 AM
naga chaitanya,vikram k kumar,thank you,majili,venky mama  థ్యాంక్యూ సినిమాలో చైతన్య పాత్రపై క్రేజీ అప్డేట్..
Latest update about Chaitanyas role in Thank You.. థ్యాంక్యూ సినిమాలో చైతన్య పాత్రపై క్రేజీ అప్డేట్..
Advertisement
Ads by CJ

అక్కినేని నాగచైతన్య వరుస సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. మజిలీ, వెంకీమామా ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా సినిమాలని లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ స్టోరీ చిత్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రామీణ యువకుడిగా కనిపించనున్నాడు. ఇందుకోసం చైతన్య తెలంగాణ గ్రామీణ మాండలికాన్ని కూడా నేర్చుకున్నాడట. ఈ సినిమాలో చైతన్య కెరీర్  బెస్ట్ పర్ ఫార్మెన్స్ చూడబోతున్నామని అన్నారు.

సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మరో మంచి ప్రేమ కథా చిత్రంగా నిలిచిపోతుందని నమ్ముతున్నారు. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడిన ఈ చిత్రం థియేటర్లు తెరుచుకోగానే ప్రేక్షకులని పలకరించనుంది. ఐతే ఈ సినిమా తర్వాత చైతన్య మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నాడు. థ్యాంక్యూ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో చైతన్య పాత్ర గురించి ఆసక్తికరమైన అప్డేట్ బయటకి వచ్చింది.

చైతన్య ఈ సినిమాలో మూడు విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తాడట. ఆ మూడు గెటప్పులు కూడా ప్రేక్షకులని బాగా ఎంటర్ టైన్ చేస్తాయని అంటున్నారు. ఇష్క్, మనం, 24 వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్, ఆ తర్వాత హలో సినిమాతో చతికిలపడ్డాడు. మరి ఈ సినిమాతోనైనా మళ్లీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి. కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రం  సెట్స్ మీదకి వెళ్లనుందట.

Latest update about Chaitanyas role in Thank You..:

Latest update about Chaitanyas role in Thank You..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ