Advertisementt

ఆసక్తికరమైన టైటిల్ తో వస్తున్న సత్యదేవ్..

Fri 21st Aug 2020 08:52 AM
satyadev,tamannah,umur,love mocktail,gurtunda seetakalam  ఆసక్తికరమైన టైటిల్ తో వస్తున్న సత్యదేవ్..
Interesting Title for Satyadevs new film.. ఆసక్తికరమైన టైటిల్ తో వస్తున్న సత్యదేవ్..
Advertisement
Ads by CJ

యాక్టర్ సత్యదేవ్ హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇటు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ కనిపిస్తూ వస్తున్నాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో సత్యదేవ్ సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లు ఇంకా తెరుచుకోని కారణంగా సత్యదేవ్ హీరోగా చేసిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఓటీటీలో విడుదలైంది. కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఓటీటీలో సినిమా విడుదలైతే హిట్టా, ఫట్టా అనేది తెలియదు. సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ ఆధారంగానే సినిమా ఎలా ఉందనేది తెలిసిపోతుంది. ఆ రకంగా చూస్తే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం మంచి విజయం అందుకుందనే చెప్పాలి. ప్రస్తుతం సత్యదేవ్ కి మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే కొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో తమన్నా హీరోయిన్ గా చేస్తున్న సినిమా కూడా ఒకటి. 

సత్యదేవ్ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం కన్నడలో సక్సెస్ సాధించిన  లవ్ మాక్ టైల్ చిత్రానికి రీమేక్ గా వస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకులకి సులువుగా గుర్తుండే విధంగా ఉన్న ఈ టైటిల్ బాగుంటుందని ఆలోచిస్తున్నారట.

Interesting Title for Satyadevs new film..:

Interesting Title for Satyadevs new film..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ