Advertisementt

‘ఆదిపురుష్’ గురించి కృష్ణంరాజు ఏం చెప్పాడంటే..?

Sat 22nd Aug 2020 12:33 AM
prabhas,krishnam raju,adipurush,hollywood film,young rebel star  ‘ఆదిపురుష్’ గురించి కృష్ణంరాజు ఏం చెప్పాడంటే..?
Krishnam Raju Talks about Prabhas AdiPurush Movie ‘ఆదిపురుష్’ గురించి కృష్ణంరాజు ఏం చెప్పాడంటే..?
Advertisement
Ads by CJ

ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రభాస్ 22 అదేనండి ప్రభాస్ - ఓం రౌత్ ఆదిపురుష్ సినిమా గురించి చెప్పిన ముచ్చట్లు వింటే ప్రభాస్ ఫాన్స్ కి మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడికి దిమ్మ తిరగాల్సిందే. ప్రభాస్ ఆదిపురుష్ అంటే విష్ణు మూర్తి అవతారాల్లో ఆదిపురుష్ అవతారం ఒకటని... సోసియో ఫాంటసీ కథతో పెద్ద ఎత్తున భారీ బడ్జెట్‌తో ఈ సినిమా చెయ్యాలని చూస్తున్నారు. ఈ ఆదిపురుష్ కథ నేను కూడా విన్నాను. చాలా బాగుంది. ప్రభాస్ ఈ సబ్జెక్ట్ విని ఇంప్రెస్ అవడమే కాదు.. సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా దాదాపుగా 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. కేవలం ఐదు భాషల్లోనే కాదు.. ఈ సినిమా హాలీవుడ్ టార్గెట్‌గా తెరకెక్కుతుంది. బాహుబలితో బాలీవుడ్ ని షేక్ చేసిన ప్రభాస్.. ఈ సినిమాతో ఈసారి హాలీవుడ్‌ని షేక్ చెయ్యడం ఖాయమంటున్నారు ఆయన.

ఆలిండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తాం. నరేంద్ర మోడీగారు అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేశారు. రాముడి కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ కథ తెరపైకి రావడం చాలా గొప్ప విషయం. మొత్తం ప్రపంచం ఆశ్చర్య పోయేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని చెబుతున్నాడు. ఇక ఆదిపురుష్‌లో దశావతారాలు ఉంటాయా.. లేదా ఆదిపురుష్ అవతారం ఒకటేనా అనేది మేకర్స్ ఫస్ట్ లుక్ లోనే క్లారిటీ ఇస్తారని చెబుతున్నాడు.  

నాకోరిక ఏమిటంటే ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళాలి.. అక్కడ హిట్ కొట్టాలి. బ్లవర్లీ హిల్స్‌లో ఓ బిల్డింగ్ ప్రభాస్ కి ఉండాలి.. అక్కడ నేను ప్రభాస్ కలిసి భోజనం చెయ్యాలి ఇదే నా కోరిక. ఇదే విషయం ప్రభాస్‌కి కూడా చెప్పా అంటున్నాడు కృష్ణంరాజు. మరి కృష్ణంరాజు చెప్పేదాన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఆదిపురుష్ హాలీవుడ్ రేంజ్ మూవీ అన్నమాట.

Krishnam Raju Talks about Prabhas AdiPurush Movie:

AdiPurush Movie Hollywood Movie says Krishnam Raju

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ