ప్రస్తుతం కరణ్ జోహార్.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో సంబంధం లేకపోయినా.. సుశాంత్ సింగ్ అభిమానులకు అడ్డంగా దొరికాడు. స్టార్ వారసులను పరిచయం చేస్తూ మిగతా వారిని తొక్కేస్తాడని కరణ్ పై అందరూ విరుచుకుపడుతుంటే.. స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఏకంగా ఆయనకిచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తుంది. తనని ఇండస్ట్రీ వదిలి పోవాలంటూ బెదిరించినట్టుగా ఆరోపణలు చెయ్యడం, సుశాంత్ సింగ్ రాజపుత్ మరణానికి కరణ్ కారణమంటూ చిందులు తొక్కుతుంది. అలాంటి కరణ్ ఇప్పుడో స్టార్ హీరో వలన బాధపడుతున్నాడట.
అదే బాహుబలి ‘ప్రభాస్’. బాహుబలి పాన్ ఇండియా మూవీగా చేసినప్పుడు బాలీవుడ్‌లో కరణ్ జోహార్ సాయంతోనే ఆ సినిమాని అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ చేసుకున్న బాహుబలి టీం లో ప్రభాస్ కి కరణ్ జోహార్ ఆప్తమిత్రుడు అయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్ తో ఓ హిందీ స్ట్రయిట్ మూవీ చేయాలని కరణ్ జోహార్ భావించాడు. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌లో ప్రభాస్‌ని బాలీవుడ్‌కి పరిచయం చేయాలని చూస్తే.. ప్రభాస్ మాత్రం తన ఫ్రెండ్స్ యువి క్రియేషన్స్ లోనే సినిమాలు చేసుకుంటూ ఉండిపోయాడు. సరే బాలీవుడ్‌కి ప్రభాస్ ని పరిచయం చేద్దామని వేచి చూస్తున వేళ ప్రభాస్ టి సీరీస్ తో కలిసి ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ని అనౌన్స్ చేసాడు.
దీనితో కరణ్ జోహార్ అప్‌సెట్ అయినట్లుగా న్యూస్. అసలే సుశాంత్ సింగ్ మరణంతో ఢీలా పడి.. ఇంట్లోనే ఉంటూ మనశ్శాంతిని కోల్పోయిన కరణ్ జోహార్ కి ప్రభాస్ చేసిన పని పుండు మీద కారం జల్లినట్టుగా ఉంది. బాహుబలి కోసం బాలీవుడ్‌లో గొడ్డు చాకిరీ చేయించుకుని.. ఇప్పుడు ఇలా హ్యాండ్ ఇవ్వడంతో కరణ్ బాగా ఫీలవుతున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.