Advertisementt

నితిన్ రీమేక్ సినిమాకి ఇస్మార్ట్ భామ..?

Thu 20th Aug 2020 08:27 PM
nabha natesh,nithin,andhadhun,merlapaka gandhi  నితిన్ రీమేక్ సినిమాకి ఇస్మార్ట్ భామ..?
Ismart Heroine for Nithins movie..? నితిన్ రీమేక్ సినిమాకి ఇస్మార్ట్ భామ..?
Advertisement
Ads by CJ

భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాక నితిన్ మంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో బాలీవుడ్ అంధాధున్ తెలుగు రీమేక్ కూడా ఒకటి. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రబృందం నటీనటులని ఎంపిక చేసే పనిలో చాలా బిజీగా ఉంది. ఈ కరోనా సమయాన్ని పూర్తిగా దానికే వెచ్చిస్తుంది. 

అంధాధున్ చిత్రంలో టబు పోషించిన పాత్రలో ఎవరిని తీసుకోవాలా అని సతమతమవుతున్న టైమ్ లో రాధికా ఆప్టే చేసిన పాత్రకి హీరోయిన్ దొరికిందని అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకొచ్చిన కన్నడ భామ నభా నటేష్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆ పాత్రలో నభా నటేష్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. 

మరి నభా నటేష్ ఒప్పుకుంటుందా లేదా చూడాలి. ప్రస్తుతం నభా, సాయి ధరమ్ తేజ్ సినిమా సోలో బ్రతుకే సో బెటరు చిత్రంలో కనిపించనుంది. ఇంకా వరుణ్ తేజ్ సరసన స్పోర్ట్స్ డ్రామాలో చేయనుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఓకే అయితే ఆమె కెరీర్ కి బాగా ప్లస్ అవుతుంది. చూడాలి మరేం జరగనుందో..

Ismart Heroine for Nithins movie..?:

Ismart Heroine for Nithins movie..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ