Advertisementt

నాని సినిమాకి సెకండ్ హీరోయిన్ దొరికేసింది..?

Thu 20th Aug 2020 08:33 AM
aditi rao hydari,nani,shyam singa roy,rahul sankrityan,tuck jagadishm shiva nirvana  నాని సినిమాకి సెకండ్ హీరోయిన్ దొరికేసింది..?
Nani Shyam Singa Roy got second heroine.. నాని సినిమాకి సెకండ్ హీరోయిన్ దొరికేసింది..?
Advertisement
Ads by CJ

ఎన్నో రోజులుగా ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాని వి చిత్రం మరికొద్ది రోజుల్లో ఇంట్లోకే వచ్చేస్తుంది. ఈ విషయమై ఈ రోజు అధికారిక ప్రకటన వెలువడనుంది. వి అనంతరం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేస్తున్న నాని, మరికొద్ది రోజుల్లో మరికొద్ది రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా కనిపిస్తుంది. వరుస సినిమాలని లైన్లో పెడుతున్న నాని టక్ జగదీష్ తర్వాత టాక్సీవాలా దర్శకుడితో సినిమా ఒప్పుకున్నాడు.

రాహుల్ సాంక్రిత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్యామ్ సింగరాయ్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. పీరియాడికల్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం నాని కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సాయి పల్లవి ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది. ఐతే ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్రలో అదితీ రావ్ ని తీసుకోవాలని చూస్తున్నారట. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన అదితీ రావ్ హైదరీ, నాని వి సినిమాలో ఒకానొక హీరోయిన్ గా కనిపించనుంది.

ఇప్పుడు మళ్లీ నాని శ్యామ్ సింగరాయ్ చిత్రంలోనూ సెకండ్ హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉందట. మొత్తం ముగ్గురు హీరోయిన్లలో ఇద్దరు హీరోయిన్ల ఎంపిక జరిగిపోయిందని మూడవ హీరోయిన్ కోసం వెతుకుతున్నారని అంటున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలతో బిజీ అవుతోన్న అదితీ రావ్ హైదరీ, శ్యామ్ సింగరాయ్ తో ఇక్కడే సెటిల్ అవుతుందేమో చూడాలి. 

Nani Shyam Singa Roy got second heroine..:

Nani Shyam Singa Roy got second heroine..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ