Advertisementt

హిట్ కాంబో మళ్లీ రిపీట్.. మాస్ ఫార్ములాతోనే..?

Thu 20th Aug 2020 08:12 AM
ram pothineni,rapo,puri jagannadh,ismart shankar,vijay devarakonda  హిట్ కాంబో మళ్లీ రిపీట్.. మాస్ ఫార్ములాతోనే..?
Hit combination repeat హిట్ కాంబో మళ్లీ రిపీట్.. మాస్ ఫార్ములాతోనే..?
Advertisement
Ads by CJ

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో, ఇక పనైపోయిందని విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో దూసుకొచ్చాడు. చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రం రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతే కాదు అప్పటి నుండి మాస్ జనాల్లో రామ్ కి ఫాలోయింగ్ ఏర్పడింది. అటు పూరీ జగన్నాథ్ కీ, ఇటు హీరో రామ్ కీ ఇస్మార్ట్ శంకర్ తో మంచి బ్లాక్ బస్టర్ దొరికింది.

ప్రస్తుతం వీరిద్దరు వేరు వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. హీరో రామ్ రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా కరోనా కారణంగా ఇంకా విడుదల కాలేదు.  పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ తో పైటర్ సినిమా చేస్తున్నాడు. ఫైటర్ ఇంకా చిత్రీకరణ పూర్తి చేసుకోలేదు. ఐతే ఇస్మార్ట్ శంకర్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

రెడ్ తర్వాత రామ్ ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడనేది ప్రకటించలేదు. అటు పూరీ కూడా ఫైటర్ తర్వాత ఎవరితో చేస్తాడనేది తెలియదు. సో.. వీరిద్దరూ కలిసి సినిమా తెరకెక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. అది కూడా మళ్లీ ఇస్మార్ట్ శంకర్ వంటి మాస్ మసాలా చిత్రంతోనే వస్తారట. ఈ విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక సమాచారం బయటకి వస్తుందట.

Hit combination repeat:

Hit combination repeat

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ