Advertisementt

ఆది పురుష్ కోసం నాగ్ అశ్విన్ ది లేట్ అవుతుందా?

Fri 21st Aug 2020 11:09 AM
adi purush,prabhas movie,nag aswain,prabhas and nag aswin movie  ఆది పురుష్ కోసం నాగ్ అశ్విన్ ది లేట్ అవుతుందా?
News About Adi Purush Movie and Nag Aswain Movies ఆది పురుష్ కోసం నాగ్ అశ్విన్ ది లేట్ అవుతుందా?
Advertisement
Ads by CJ

ప్రభాస్ మరో ఐదేళ్లవరకు ఖాళీ అనే పదానికి చోటు లేకుండా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఎక్కడా సౌత్ మాటెత్తకుండా అన్ని పాన్ ఇండియా మూవీస్ నే అనౌన్స్ చేస్తున్నాడు. వరసగా మూడు సినిమాల్తో ప్రభాస్ బిజీ బిజీ. రాధాకృష్ణ తో రాధే శ్యాం సినిమా చేస్తున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ తో మరో సోసియో ఫాంటసీ మూవీని ప్రకటించాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనేని హీరోయిన్ గా సెలెక్ట్ కూడా చేసుకున్నారు. నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ సినిమా వర్క్ లో ఫుల్ బిజీగా వున్నాడు. ఈలోపు ప్రభాస్ బాలీవుడ్ దర్శకనిర్మాతలతో ఆది పురుష్ చెయ్యనున్నట్టుగా  పోస్టర్ తో సహా ప్రకటించాడు.

సరే ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా ప్రభాస్ సినిమాలు లైన్ లో పెడుతున్నాడులే అనుకుంటే.. ఇప్పుడు ఆది పురుష్ కోసం నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కొంత డిలే అయ్యేలా ఉంది అంటున్నారు. కారణం ఆది పురుష్ సినిమాని ఒకటి రెండు షెడ్యూల్స్ అయ్యాకే నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కుతుందట. ఎందుకంటే ఆది పురుష్ సినిమా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం ఉన్న సినిమా కావడం చేత... కొంత‌మేర టాకీ పూర్త‌యితే.. దాన్ని బట్టి మెల్ల‌గా విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన ప‌నులూ మొద‌లు పెట్టుకోవొచ్చ‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచ‌న‌. అందుకే ప్రభాస్ ని రిక్వెస్ట్ చెయ్యగా దానికి ప్రభాస్ ఓకె చెప్పడని టాక్. ఇక అది పురుష్ షూటింగ్ ముందు మొదలైనా.. చివరికి నాగ్ అశ్విన్ సినిమానే ముందు విడుదలవుతుంది అని అంటున్నారు. మరి ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ జోడిగా ఏ హీరోయిన్ నటిస్తుందో చూడాలి.

News About Adi Purush Movie and Nag Aswain Movies:

News About Adi Purush Movie and Nag Aswain Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ