Advertisementt

అదే జరిగితే ఆమె దశ తిరిగినట్టే..

Wed 19th Aug 2020 09:12 AM
prabhas,nivetha thomas,nag ashwin,nani  అదే జరిగితే ఆమె దశ తిరిగినట్టే..
NIvetha Thomas as a second heroine in.. అదే జరిగితే ఆమె దశ తిరిగినట్టే..
Advertisement
Ads by CJ

జెంటిల్ మేన్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భామ నివేథా థామస్, తన నటనతో, గ్లామర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాని సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నివేథా, ఇప్పటి వరకు నానితో మూడు సినిమాలు చేసింది. నటన పరంగా గ్లామర్ పరంగా ఎలాంటి లోపాలు కనిపించని నివేథాకి సరైన అవకాశాలు రాలేవనే చెప్పాలి. లేదంటే ఈ పాటికే స్టార్ హీరోయిన్ అయ్యుండేది. ఎన్టీఆర్ పక్కన జైలవకుశ తప్ప ఆమె కెరీర్లో స్టార్ హీరోతో సినిమా చేయలేదు.

ఐతే ప్రస్తుతం ఆ అవకాశం వచ్చినట్టే ఉంది. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్  లో కీలక పాత్రలో కనిపిస్తున్న నివేథాకి మరో భారీ బడ్జెట్ చిత్రంలో అవకాశం వచ్చిందని చెప్పుకుంటున్నారు. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సైంటిఫిక్ ఫిక్షన్ లో నివేథా థామస్ ని తీసుకుందామని ఆలోచిస్తున్నారట. మొదటి హీరోయిన్ గా దీపికా పదుకునే చేస్తుండగా, సెకండ్ హీరోయిన్ గా నివేథా థామస్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట.

ఒకవేళదే జరిగితే నివేథా థామస్ కి మంచి అవకాశం లభించినట్టే. ఇప్పటి వరకూ ఒకేలా సాగుతున్న ఆమె కెరీర్ ఒక్కసారిగా పీక్స్ కి వెళ్తుంది. ప్రభాస్ సినిమా అంటే నివేథా నో అనే ఛాన్స్ అస్సలే ఉండదు కాబట్టి నాగ్ అశ్విన్ ఆమెకి అవకాశం ఇస్తాడా లేదా చూడాలి.

NIvetha Thomas as a second heroine in..:

NIvetha Thomas as a second heroine in..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ