కరోనా వలన సినిమా ఇండస్ట్రీలోని పారితోషకాలు, బడ్జెట్స్ అన్ని మారిపోయాయి. కోట్లకి కోట్లు తీసుకునే హీరోలు, దర్శకులు కరోనాతో ఇబ్బందులు పడుతున్న నిర్మాతలను ఆదుకోవడానికి ముందుకు రావాల్సి ఉంది. అయితే కొంతమంది హీరోయిన్స్ కూడా తమ పారితోషకాలు తగ్గించుకునే అవకాశాలు కలవు అంటూ వార్తలొస్తుంటే.. టాలీవుడ్ క్రేజీ, లక్కీ హీరోయిన్ రష్మిక మాత్రం ఫుల్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. ఇప్పటికే మహేష్, నితిన్‌లతో ఈ ఏడాది భారీ హిట్స్ కొట్టిన రష్మిక, అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా ఫిలిం చేస్తుంది.
అలాగే రష్మికకి రామ్ చరణ్ సరసన ‘ఆచార్య’ సినిమాలో ఓ 20 నిమిషాల కేరెక్టర్ వచ్చింది అనే టాక్ ఉంది. జస్ట్ 20 నిమిషాలే కదా అని రష్మికకి లక్షల్లో పారితోషకం ఆఫర్ చెయ్యగా రష్మిక కుదరదు కోటి ఇస్తేనే సినిమా అంటుందట. రామ్ చరణ్‌తో జోడి, చిరు సినిమా అంటే ఎంత పెద్ద సినిమా. అయినప్పటికీ... రష్మిక మాత్రం పారితోషకం విషయంలో తగ్గనంటుంది. మరోపక్క స్టార్ డం లేని హీరోలకు, చిన్న హీరోలకి రష్మిక నో చెబుతుందనే టాక్ నడుస్తుంది. ప్రస్తుతం లక్కీగా అదృష్టంతో ఆఫర్స్ పట్టేస్తున్న రష్మిక మీద ముందు నుండి పారితోషకం విషయంలో వార్తలొస్తూనే ఉన్నాయి. మరి కరోనా టైం లో కూడా పారితోషకం తగ్గకపోతే పాపకి కష్టాలు తప్పవు.