భారతదేశంలో జరిగిన అతిపెద్ద సెక్యూరిటీస్ కుంభకోణం గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ కుంభకోణానికి కారకుడు హర్షద్ మెహతా.. 1992 సంవత్సరంలో సెక్యూరిటీస్ స్కామ్ తో స్టాక్ మార్కెట్ ని ఎత్తులకి తీసుకెళ్ళి ఆ తర్వాత అధఃపాతాళానికి పడేసాడు. ఒక స్టాక్ బ్రోకర్ ఈ విపరీతానికి కారకుడయ్యాడు. తాజాగా ఈ వ్యక్తి జీవితంపై తెర మీదకెక్కింది. హర్షద్ మెహతా జీవితంపై వెబ్ సిరీస్ రూపొందించారు.
బిజినెస్ జర్నలిస్ట్ అయిన సుచేతా దలాల్, ఆమె భర్త దెబాషిస్ బసు రచించిన పుస్తకం.. ద స్కామ్ ఆధారంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది. హర్షద్ మెహతా పాత్రలో గుజరాత్ థియేటర్ ఆర్టిస్ట్ ప్రతీక్ గాంధీ నటిస్తున్నాడు. జర్నలిస్ట్ గా శ్రేయా ధన్వంతరీ కనిపిస్తోంది. 500కోట్ల స్కామ్ గురించి జర్నలిస్టు ప్రశ్నలు వేస్తుండగా ఆ స్కామ్ ఎవరో చేసారో చెప్పేటపుడు ఆ వ్యక్తి తడబడుతూ హర్షద్ మెహతా అని చెప్తాడు.
అది విన్న జర్నలిస్ట్ మొహంలో ఆశ్చర్యకరమైన భావం కనిపిస్తుంది. హర్షద్ మెహతా పాత్రలో ప్రతీక్ గాంధీ ఎలా ఉంటాడో రివీల్ చేయనప్పటికీ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. హన్షల్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవనుంది.