Advertisementt

ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంపై ఆసక్తికర అంశాలు..

Tue 18th Aug 2020 03:56 PM
prabhas,adipurush,om raut,bollywood,hrithik roshan,tseries  ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంపై ఆసక్తికర అంశాలు..
Interesting things about Prabhas Adipurush ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంపై ఆసక్తికర అంశాలు..
Advertisement
Ads by CJ

నేషనల్‌ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని ప్రకటించాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.  20వ చిత్రం రాధేశ్యామ్ ఇంకా సెట్స్ పై ఉండగానే  21వ చిత్రం ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉండగా 22వ చిత్రాన్ని ప్రకటించి ఆశ్చర్య పరిచాడు. ఐతే ఈ సినిమాకి సంబంధించిన సిట్టింగ్స్ సాహో నుండి జరుగుతున్నాయట. ఏదైతేనేం మొత్తానికి ప్రభాస్ ఖాతాలో మరో భారీ పాన్ ఇండియా చిత్రం చేరింది.


ఆదిపురుష్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీ మహావిష్ణువు కి సంబంధించిన అంశాలు ఉంటాయట. ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడని అంటున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఆదిపురుష్ తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల అవుతుంది. ప్రభాస్ కెరీర్లో మొట్టమొదటి సారి త్రీడీలో రూపొందుతున్న చిత్రమిది.


ప్రభాస్ తో పాటు మరో బాలీవుడ్ హీరో ఇందులో కనిపిస్తాడట. అది హృతిక్ రోషన్ అయ్యుంటాడని సమాచారం. మొత్తానికి భారతీయ ఇతిహాస గాథని వెండితెర మీదకి అతిపెద్ద స్కేల్ లో తీసుకురాబోతున్నారు.

 

Interesting things about Prabhas Adipurush:

Interesting things about Prabhas Adipurush

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ