Advertisementt

ఎట్టకేలకు ప్రభాస్ కి ఈసారి కుదిరింది..

Tue 18th Aug 2020 09:59 AM
prabhas22,on raut,bollywood,adipurush  ఎట్టకేలకు ప్రభాస్ కి ఈసారి కుదిరింది..
Prabhas new film Bollywood director ఎట్టకేలకు ప్రభాస్ కి ఈసారి కుదిరింది..
Advertisement
Ads by CJ

బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ కి అభిమానులు ఇండియా మొత్తం ఉన్నారు. దక్షిణాది హీరో అయిన ప్రభాస్ స్ట్రెయిట్ హిందీ సినిమా చేయాలని చాలా మంది ఆశించారు. వాళ్ల కోరిక తీర్చడానికే ప్రభాస్ సాహో సినిమా కోసం సొంతంగా హిందీలో డబ్బింగ్ చెప్పుకున్నాడు. అయితే తాజాగా హిందీ అభిమానుల కోరిక నెరవేరే సమయం వచ్చేసింది. బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా మొదలవబోతుంది.


నిన్నటికి నిన్న ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సర్ప్రైజ్ వచ్చేస్తుందని ప్రకటించారు. సోషల్ మీడియాలో అంతగా ఆక్టివ్ గా ఉండని ప్రభాస్, సర్పైజ్ రాబోతుందని, ఎక్సయిటింగ్ గా ఉందని బాలీవుడ్ దర్శాకుడు ఓ రౌత్ తో మాట్లడడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ రోజు ఉదయం ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పేసారు. బాలీవుడ్ జనాలు కావాలనుకున్నట్టుగా స్ట్రెయిట్ హిందీ చిత్రంతో పలకరించబోతున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.


రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ తో సైంటిఫిక్ డ్రామా చిత్రాల అనంతరం ఈ సినిమా పట్టాలెక్కనుంది. బాలీవుడ్ దర్శకుడితో సినిమా మొదలు పెట్టి మొత్తానికి ప్రభాస్ నిజమైన పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు.

 

Prabhas new film Bollywood director:

Prabhas new film Bollywood director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ