Advertisementt

‘పుష్ప’పై సుకుమార్ క్లారిటీ ఇచ్చేశాడు

Wed 19th Aug 2020 12:43 AM
sukumar,pushpa,budget,work from home,budget control,allu arjun  ‘పుష్ప’పై సుకుమార్ క్లారిటీ ఇచ్చేశాడు
No Budget Control for Allu Arjun Pushpa Movie ‘పుష్ప’పై సుకుమార్ క్లారిటీ ఇచ్చేశాడు
Advertisement
Ads by CJ

కరోనా పరిస్థితి వల్ల ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం కకావికలం అయ్యింది. కరోనా వలన నిర్మాతలు భారీ నష్టాల పాలయ్యారు. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలకు ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. హీరోలు, దర్శకులు అంతా కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు షూటింగ్స్‌కి వచ్చేలా లేరు. దానితో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నా చేసేది లేదు. అందుకే బడ్జెట్ కంట్రోల్ అంటున్నారు. కానీ అది వర్కౌట్ అవుతుందా.. లేదా.. అనేది ఇప్పుడు దర్శకనిర్మాతల ముందున్న అతి పెద్ద సమస్య. రాజమౌళి RRR మిగిలిన షూటింగ్ కి బడ్జెట్ కంట్రోల్ చేస్తే మనము చెయ్యొచ్చు అని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ రాజమౌళి ఏం చేయలేక కరోనా బారిన పడ్డాడు.

అయితే తాజాగా సుకుమార్ అండ్ బన్నీ లు పుష్ప పాన్ ఇండియా ఫిలిం కోసం భారీ బడ్జెట్ అనుకున్నారు. బన్నీ రిలేటివ్ అండ్ మైత్రి వారు పుష్ప కోసం భారీగా ప్లాన్ చేసారు. కరోనా వలన బడ్జెట్ కంట్రోల్ అంటూ ప్రచారం జరిగినా.. పుష్ప కి బడ్జెట్ కంట్రోల్ లేదంటున్నారు. ముందుగానే అన్ని భాషలకు కలిపి పాన్ ఇండియా మూవీకి 100 కోట్ల బడ్జెట్ వేసుకున్నారట, ఎంత తగ్గిద్దామనుకుంటున్నా.. ఎక్కడా బడ్జెట్ ని తగ్గించలేక నానా కుస్తీలు పడిన తర్వాత.. సుకుమార్ అండ్ టీం పుష్ప ని ఎలాంటి బడ్జెట్ కంట్రోల్ లేకుండా ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యారట. కథ పై వారికున్న నమ్మకమే బడ్జెట్ లో కంట్రోల్ లేకుండా ఉండడానికి కారణమంటున్నారు. 

No Budget Control for Allu Arjun Pushpa Movie:

Sukumar Clarity about Pushpa Movie Budget 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ