Advertisementt

రజినీకాంత్ తర్వాత విజయ్.. మొదలైంది!

Wed 19th Aug 2020 12:35 AM
vijay,tamil star hero,political entry,rajinikanth  రజినీకాంత్ తర్వాత విజయ్.. మొదలైంది!
Tamil Actor Vijay hints at entry into politics రజినీకాంత్ తర్వాత విజయ్.. మొదలైంది!
Advertisement
Ads by CJ

తమిళనాట రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం ఇదిగో అదిగో అంటూ ఇప్పటికే ఏళ్ళకి ఏళ్ళు గడుస్తున్నాయి కానీ... రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చింది లేదు.. ఆయన రాజకీయం చేసింది లేదు. కానీ సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే రాజకీయాల్లోకి రజినీకాంత్ రాకపోవచ్చేమో అనే ఊహాగానాలు ఉన్నాయి. కారణం ఆయన ఆరోగ్యమే. అయితే ఇప్పుడు రజిని టైప్ లోనే మరో హీరో రాజకీయ అరంగేట్రంపై ఓ న్యూస్ కోలీవుడ్ నుండి టాలీవుడ్ మీడియా సర్కిల్స్ వరకు స్ప్రెడ్ అయ్యింది. తమిళనాట రజినీకాంత్‌లానే టాప్ ప్లేస్‌లో ఉన్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నాడని న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

అజిత్ ఫ్యాన్స్ - విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంతగా చెలరేగిపోయి.. గొడవ చేసినా విజయ్ ఎప్పుడూ స్పందించింది లేదు. ఎప్పుడూ గుంభనంగా ఉండే విజయ్ తాజాగా తన క్రేజ్‌తో రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నాడని న్యూస్ కోలీవుడ్‌ని షేక్ చేస్తుంది. అయితే విజయ్ ఏ రాజకీయ పార్టీ ద్వారానో రాజకీయాల్లోకి రాకుండా.. సొంతంగా పార్టీ పెట్టి మరీ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాని ముంచేసింది. దానిలో భాగంగా విజయ్ తండ్రి ఇప్పటికే రంగంలోకి దిగారని.. ఆయన విజయ్ పార్టీ గురించి గ్రౌండ్ వర్క్ చెయ్యడము..కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయడానికి కూడా రెడీ అవుతున్నారనే న్యూస్ వినిపిస్తుంది. అయితే కొంతమంది ఇప్పటి వరకు రజిని ఊగాడు.. కానీ రాజకీయాల్లోకి రావడానికి ధైర్యం చాలడం లేదు.. ఇక ఇప్పుడు విజయ్ వంతు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Tamil Actor Vijay hints at entry into politics:

Tamil Star Hero Vijay Political entry Very soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ