నాని ఇప్పుడు టక్ జగదీశ్, శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కరోనా వలన ఇంట్లో కూర్చున్న నాని.. కెరీర్ ప్రారంభించాక ఇన్ని రోజుల గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదు. అయితే నాని ‘వి’ ద మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి విడుదలయ్యే సమయానికి కరోనాతో థియేటర్స్ బంద్ అయ్యాయి. దానితో మా సినిమా వస్తే థియేటర్స్‌లోనే అని కూర్చున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వాళ్ళు భారీ ధర ఇస్తామన్నా ఒప్పుకోలేదు. అయితే గత వారం రోజులుగా నాని అండ్ నిర్మాత దిల్ రాజులు ఈ ‘వి’ సినిమా అమెజాన్ ప్రైమ్ వారికీ 35 కోట్లకి అమ్మేశారని.. నాని ‘వి’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సెప్టెంబర్ 5న దిగబోతుంది అంటూ న్యూస్ వచ్చింది.
కానీ ఇప్పటివరకు దానిపై ప్రకటన రాలేదు. నాని కానీ, సుధీర్ బాబు కానీ, దిల్ రాజు కానీ మా సినిమా ఓటిటిలో అని కానీ, ఓటిటిలో మా సినిమా అంటున్నారు.. అది పుకారని కానీ స్పందించలేదు. ఒకవేళ సెప్టెంబర్ 5న సినిమా విడుదలైతే ఈపాటికి ప్రమోషన్ స్టార్ట్ అవ్వాలి. కానీ లేదు. అయితే ఓటిటిలో ఈమధ్యన చాలా సినిమాలు ప్రమోషన్స్ లేకుండా సైలెంట్‌గా దిగినట్టుగానే వి కూడా ఏ అర్ధరాత్రో డిజిటల్ స్ట్రీమింగ్‌కి ఎక్కుతుందేమో అనుకుంటున్నారు. లేదంటే పోస్టర్స్ విడుదలో.. అలాగే టీజర్, ట్రైలర్ నాని ఇంటర్వ్యూ, సుధీర్ బాబు ఇంటర్వ్యూ, ఇంద్రగంటి ఇంటర్వ్యూ అంటూ హడావిడి ఉండాల్సింది. అదే థియేటర్స్ లో విడుదలైతే గనక ఈసరికే నాలుగు ప్రెస్ మీట్స్, ఓ ట్రైలర్ లాంచ్, ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ జరిగేవి. మరి కన్ఫర్మ్‌గా ‘వి’ ఓటిటికి ఇచ్చారా.. లేదంటే లేదా అనేది క్లారిటీ ఇవ్వడం లేదు.