తెలుగు టెలివిజన్ లో అత్యంత ప్రజాదరణ దక్కించుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో షో నిర్వహించడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ యాజమాన్యం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్లని పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచిన సంగతి తెలిసిందే.
అయితే పద్నాలుగు రోజుల తర్వాత టెస్టులు నిర్వహించారట. మొత్తం పదహారు మంది కంటెస్టెంట్లకి నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని సమాచారం. అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వారంతా సేఫ్ గా అడుగు పెట్టవచ్చు. అంతే కాదు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా భౌతిక దూరం పాటించే టాస్కులే ఉంటాయట. ఇంకా గతంలోలా కాకుండా ఈ సారి బిగ్ బాస్ లో చాలా మార్పులని చూడబోతున్నాం.
అయితే టెస్టులు పూర్తయ్యాయి కాబట్టి షూటింగ్ మొదలు పెడతారట. ఈ నెల ఆగస్టు 22వ తేదీ నుండి బిగ్ బాస్ షో చిత్రీకరణ ప్రారంభం కానుందని అంటున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్లుగా వచ్చే వారి పేర్లు సోషల్ మీడియాలో వచ్చాయి. మరి వారంతా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారో లేదో తెలియాలంటే బిగ్ బాస్ షో స్టార్ట్ అవ్వాల్సిందే