Advertisementt

బిగ్ బాస్ లోకి జానీ మాస్టర్..?

Mon 17th Aug 2020 08:26 AM
biggbosstelugu4,jani master,nagarjuna,television  బిగ్  బాస్ లోకి జానీ మాస్టర్..?
Jani Master going to Bigg Boss..? బిగ్ బాస్ లోకి జానీ మాస్టర్..?
Advertisement
Ads by CJ

కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉండడంతో సినిమా థియేటర్లు తెరుచుకోలేదు. సినిమా షూటింగులు, సీరియల్స్ షూటింగులు పూర్తిగా మొదలు కాలేదు. కొన్ని సీరియల్స్ చిత్రీకరణ జరుపుతున్నప్పటికీ కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుడికి ఎంటర్ టైన్ మెంట్ అనేది లేకుండా పోయింది. ఓటీటీలో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే వినోదానికి ఆప్షన్ గా మారాయి.

దాంతో టెలివిజన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది బిగ్ బాస్ రియాలిటీ షో గురించే.  మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కానుందని ప్రోమో రిలీజ్ చేసినప్పటి నుండి ఇంకా ఆతృతగా ఉన్నారు. ఆ ఆతృతలోనే కంటెస్టెంట్ల గురించి రకరకాల కథనాలు బయటకి వస్తున్నాయి. కరోనా కారణంగా బయట మొత్తం నెగెటివిటీ ఎక్కువగా ఉండడంతో ఈ సారి హౌస్ లో అలాంటి నెగెటివ్ వాతావరణంక్రియేట్ చేయొద్దని కంటెస్టెంట్లుగా వచ్చే వారికి ఆదేశాలు జారీ చేసారట.

సో.. ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రేక్షకులని పాజిటివిటీతో ఎంటర్ టైన్ చేస్తారట. ఈ మేరకు కంటెస్టెంట్లని జాగ్రత్తని ఎంపిక చేసారట. అయితే టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బిగ్ బాస్ లోకి రాబోతున్నారని సమాచారం అందుతోంది. రఘు మాస్టర్ పేరు కూడా వినిపించినప్పటికీ తాజాగా జానీ మాస్టర్ కన్ఫర్మ్ అయ్యాడని అంటున్నారు. మరి ఈ విషయం ఎంతమేరకు నిజమనేది బిగ్ బాస్ స్టార్ట్ అయితే గానీ తెలియదు.

Jani Master going to Bigg Boss..?:

Jani Master going to Bigg Boss..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ