కన్నడ భామ రష్మిక తెలుగులోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ లిస్ట్‌లోకి వెళ్ళిపోయింది. ఈ ఏడాది వరస హిట్స్‌తో జోరు మీదున్న రష్మిక మందన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్‌కి వెళ్తుంది. అయితే తాను కెరీర్ మొదలు పెట్టిన కొత్తల్లో అంటే కిర్రిక్ పార్టీ విడుదలై సూపర్ హిట్ అయినప్పుడు తెలుగు నుండి మంచి ఆఫర్స్ తలుపు తడితే... అప్పటికే రష్మిక సినిమాలు మానేద్దామని డిసైడ్ అయ్యిందట. తెలుగులో నటించడం అనేది అసలు సాధ్యం కాదనుకున్నాను. ఎందుకంటే తెలుగు భాష నాకు పరిచయం లేని భాష. దానితో తెలుగు వైపు రావాలన్న కోరిక, ఇంట్రెస్ట్ కూడా లేదని చెబుతుంది.
ఇక కిర్రిక్ పార్టీ విజయం తర్వాత ఉత్సాహంతో ముందు కన్నడ సినిమాలు ఒప్పుకున్నాను. కాబట్టే రెండేళ్ల పాటు తెలుగు వైపు చూడలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత కిర్రిక్ పార్టీ సినిమా చూసిన వెంకీ కుడుముల ‘ఛలో’ సినిమా అవకాశం ఇవ్వగా.. ‘ఛలో’ సినిమాలో నా పాత్ర నచ్చి నేను ఆ సినిమా ఒప్పుకుని.. అలా తెలుగు సినిమాల్లోకి ఎంటర్ అయ్యాను అని రష్మిక చెప్పుకొచ్చింది. తర్వాత వరస విజయాలతో తెలుగులో జెండా పాతేశాను అంటుంది. అలా తెలుగులోకి వచ్చిన తనకి ఇప్పుడు ఆ జర్నీ చూస్తే ఓ కలలా అనిపిస్తుందని రష్మిక తెలిపింది.