చదలవాడ శ్రీనివాసరావు గారికి జీవితాంతం రుణపడివుంటాను - రమేష్ బాబు
గౌరవనీయులైన మా అన్నగారు శ్రీ చదలవాడ శ్రీనివాసరావుగారికి మీ తమ్ముడు రమేష్ బాబు నమస్కారాలతో వ్రాయునది.. తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలాగైతే భక్తులను కాపాడుకుంటారో అలాగే మీరు కూడా కరోనా సమయంలో అల్లాడుతున్న సినీ కార్మికులకి అన్ని భాగాలకి కలిపి సమానంగా చూసి సహయపడుతున్నారు. నాకు తెలిసి దగ్గర దగ్గరగా 55 లక్షల రూపాయలను సహాయం అందించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ నిర్మాత కూడా చేయని ఆర్థిక సహాయాన్ని మీరు చేశారు. ఈ రోజుల్లో మీరు చేసిన సహాయం చాలా మంది సినీ కార్మికులకు ఎంతగానో ఉపయోగపడింది. కానీ మీరు ఇంత చేసినా కూడా ఒక్క ఫోటోకి కూడా సహకరించకపోవడం ఆశ్చర్యకరం. అదే మీ దయ.
అలాగే ఆరోగ్యం క్షీణించి కరోనాతో బాధపడుతున్న నాకు అడిగిన వెంటనే సహాయం అందించారు. మీకు ఫోన్ చేసిన వెంటనే రమేష్ భయపడకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు. వెంటనే మాతృదేవోభవ డైరెక్టర్ కె.అజయ్ కుమార్ గారితో అలాగే TFPC సెక్రటరీస్ ప్రసన్న కుమార్ - మోహన్ వడ్లపట్ల, రామ సత్యనారాయణ, ద్వారా మీరు మాకు తక్షణ ఆర్థిక సహాయంగా 55,555.00 రూపాయలు అందించారు. ఈ సహాయం చేసినందుకు మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషంగా జీవితకాలం ఐశ్వర్యంతో ఉండాలి. ఆ దేవుడు మీకు ఇంకా లక్షల కోట్ల ఆదాయం ఇవ్వాలని అలాగే మీరు ఇంకా చాలా మందికి ఇదే విధంగా సహాయ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిరంతరం మీ విజయాన్ని కోరుకుని.. మీతో నడిచే మీ తమ్ముడు డి.రమేష్ ప్రసాద్.. మీకు నమస్కారాలతో..