సుకుమార్ ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‌లో లారీ డ్రైవర్ గెటప్‌లో కనిపించబోతున్నాడనేది ‘పుష్ప’ పాన్ ఇండియా లుక్‌లోనే రివీల్ అయ్యింది. అందుకే బన్నీ లాంగ్ హెయిర్, గడ్డం పెంచాడు. లాక్‌డౌన్‌లోనూ అల్లు అర్జున్ పుష్ప లుక్‌నే మెయింటైన్ చేస్తున్నాడు. అయితే బన్నీ అందరిలా ఇంట్లోనే ఉండి సీక్రెట్‌గా లుక్ మెయింటైన్ చేయకుండా.. వాకింగ్, జాగింగ్ అంటూ బయటికి వస్తున్నాడు. పుష్ప లుక్‌లోనే బన్నీ కంటిన్యూ అవుతున్నాడు అని మరోసారి రివీల్ అయ్యింది. మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్‌లో అల్లు అర్జున్ పుష్ప లుక్ లోనే కనిపించడం కాదు... మాంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నట్లుగా అదిరిపోయే లుక్‌లో కనిపించాడు.
అయితే సుకుమార్ ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ని సిక్స్ ప్యాక్ లుక్‌లో చూపించబోతున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్‌లో నడుస్తుంది. గతంలో వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్ చేత సుకుమార్ సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేయించాడు. కానీ మహేష్ లుక్‌లో ఉన్న ఇబ్బందుల వలన మహేష్ సిక్స్ ప్యాక్ బాడీని సినిమాలో చూపించలేదు. కానీ పుష్పలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లుక్ లో కండలు తిరిగిన యంగ్ లారీ డ్రైవర్‌గా అదరగొట్టబోతున్నాడనే టాక్ వినబడుతుంది. మరి అల్లు అర్జున్ వాకింగ్, జాగింగ్‌లో నార్మల్ గా కనబడుతున్నప్పటికీ.. జిమ్‌లో సిక్స్ ప్యాక్ లుక్ ట్రై చేస్తున్నాడని.. దాని కోసం జిమ్ ట్రైనర్‌ని కూడా పెట్టుకున్నాడని టాక్. అందుకే పుష్పలో నిజంగానే బన్నీ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపిస్తాడేమో అని అంటున్నారు.