కరోనా కారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు సెలెబ్రెషన్స్ అన్నీ సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. సామాజిక దూరం పాటించాలన్న నేపథ్యంలో అభిమానులందరూ ఆన్ లైన్లో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రికార్డు నెలకొల్పుతున్నారు. తాజాగా పవర్ స్టార్ అభిమానులు సరికొత్త రికార్డుని క్రియేట్ చేసారు. పుట్టినరోజుకి పదిరోజుల ముందు నుండే సంబరాలు స్టార్ట్ చేస్తున్న అభిమానులు కామన్ సీడీపీతో మొదలుపెట్టి పుట్టినరోజు వరకూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.
మొన్నటికి మొన్న మహేష్ అభిమానులు ఏ రేంజిలో చెలరేగిపోయారో తెలిసిందే. ట్విట్టర్ లో మిలియన్లలో ట్వీట్లు వేస్తూ ట్రెండ్ సెట్ చేసారు. అయితే మహేష్ అభిమానులు వరల్డ్ రికార్డుని కొంతలో మిస్ చేసుకున్నారు. కానీ ఆ రికార్డుని పవన్ అభిమానులు బద్దలు కొట్టేసారు. #PawankalyanBirthdayCDP పేరుతో 24గంటల్లో 65 మిలియన్ల ట్వీట్లు వేసారు. కేవలం ఒక్కరోజులో అన్ని ట్వీట్లు పడటం ప్రపంచ రికార్డుగా నిలిచింది. బర్త్ డేకి ముందే ఇంతలా చెలరేగుతున్న అభిమానులు పుట్టినరోజున ఏ రేంజిలో రెచ్చిపోతారో చూడాలి.