కోవిడ్ కారణంగా నిలిచిపోయిన చిత్రీకరణని మళ్లీ ఎప్పుడు మొదలు పెట్టాలా అని చూస్తున్న వారిలో ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం మొదటి స్థానంలో నిలుస్తుంది. పరిస్థితులు కొంచెం మెరుగుపడితే చిత్ర షూటింగ్ పునఃప్రారంభించాలని చూస్తున్నారు. అల్లూరి సీతారారజుగా రామ్ చరణ్ లుక్ విడుదల చేసినప్పటి నుండి అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడోనన్న ఆసక్తి జనాల్లో పెరిగిపోతుంది.
అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి పనిచేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ అనే కాదు రాజమౌళి సినిమాలన్నింటికీ రమా గారే కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకి కాస్ట్యూమ్స్ తో పాటు స్క్రిప్ట్ వర్క్ లో కూడా సాయం చేస్తున్నారట. విజయేంద్రప్రసాద్ గారు అందించిన ఆర్ ఆర్ ఆర్ కథకి డైలాగ్స్ రాసే పనిలో ఉన్నారట.
కథలో ఉన్న ఇంటెన్సిటీ కారణంగా రమా గారు డైలాగ్స్ పై దృష్టి పెట్టారట.నిజానికి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నాడని ఇంతకుముందే ప్రకటించారు. అంటే మెయిన్ రైటర్ గా సాయి గారు డైలాగ్స్ రాస్తుంటే సహాయంగా మరికొన్ని మాటలని రమాగారు రాస్తున్నారట.