నాని ‘వి’ ద మూవీని దిల్ రాజు - నాని ఓటిటికి అమ్మేశారనే వార్తల నేపథ్యంలో మరికొన్ని సినిమాలు నాని ‘వి’ దారి పడుతున్నాయంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వి సినిమా బడ్జెట్‌తో పోలిస్తే ఓటిటిలో నెంబర్ వన్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ నాని వి సినిమాకి భారీ ధర పెట్టినట్టు తెలుస్తుంది. నాని అండ్ దిల్ రాజులు అమెజాన్ పెట్టిన ధరకు టెంప్ట్ అయ్యే ‘వి’ సినిమాని అమ్మేశారనే టాక్ నడుస్తుంది. మరి థియేటర్స్ విషయం ఎంత చెప్పినా తక్కువే అన్నట్టుగా టాప్ నిర్మాత అల్లు అరవింద్ థియేటర్స్ తెరుచుకున్నా ఇక వీకెండ్స్ తప్ప కలెక్షన్స్ ఉండవు.. ఓటిటీలదే హవా అంటూ మాట్లాడుతున్నాడు. అయితే నాని వి సినిమా అమ్ముడుపోకముందు నుండే రవితేజ - గోపీచంద్ మలినేనిల క్రాక్ సినిమా ఓటిటిలో విడుదల కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.
కొద్దిగా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తి కాగానే రవితేజ క్రాక్ ఓటీటీకి అమ్మేస్తారంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే తాజాగా ఆ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తమ సినిమా ఓటిటిలో విడుదల పై వస్తున్న వార్తలకు స్పందించాడు. మా చిత్రం థియేటర్స్‌లోనే అంటూ క్రాక్ పై వస్తున్న రూమర్స్ కి ఒకే ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టాడు గోపీచంద్ మలినేని. తమ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటిటిలో విడుదల కాదు... కేవలం థియేటర్స్‌లోనే విడుదలవుతుంది అని అంటున్నాడు. అసలే రవితేజ వరస డిజాస్టర్స్ తో ఉన్నాడు. అందుకే తన సినిమా ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల కావాలని నిర్మాతలకు చెప్పినట్టుగా ఉన్నాడు.