Advertisementt

రకుల్‌కి మరోసారి అదృష్టం పట్టినట్లే..!

Mon 17th Aug 2020 12:26 AM
rakul preet singh,krish,vaishnav tej,luck  రకుల్‌కి మరోసారి అదృష్టం పట్టినట్లే..!
One More Chance to Heroine Rakul Preet Singh రకుల్‌కి మరోసారి అదృష్టం పట్టినట్లే..!
Advertisement
Ads by CJ

రకుల్ ప్రీత్‌కి అవకాశాలు లేవు, రావడం లేదనేది జగమెరిగిన సత్యమే. కానీ రకుల్ అలా అంటే ఒప్పుకోదు. తానే సినిమా షూటింగ్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చా అంటూ చెప్పుకుంటుంది. అయితే తాజాగా రకుల్‌కి తమిళనాట కమల్ హాసన్ ఇండియన్ 2 లోను, తెలుగులో నితిన్ - చందు మొండేటి సినిమాలో నటిస్తున్నాగా వార్తలు వస్తున్నాయి. అయితే కొన్నాళ్లుగా అవకాశాలు లేని రకుల్ కి పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ మంచి ఆఫర్ వచ్చింది అనే టాక్ నడుస్తుండగా.. ఇప్పుడు మరో కుర్ర హీరోకి రకుల్ ఓకే చెప్పినట్లుగా టాక్.

అది కూడా మొదటి సినిమా ఉప్పెనతో వెండితెరకు పరిచయమైన వైష్ణవ్ తేజ్‌తో రకుల్ నటించబోతుంది అనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. ఉప్పెన సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా... కరోనాతో ఇంకా రిలీజ్ కానీ వైష్ణవ తేజ్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అనేది క్లారిటీ లేదు. అయితే వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీలో రకుల్ హీరోయిన్  అంటున్నారు. అయితే వైష్ణవ్ తేజ్ రెండో సినిమాని పవన్ దర్శకుడు క్రిష్ తో చేస్తున్నాడు. క్రిష్ కూడా పవన్ సినిమాకి భారీ గ్యాప్ రావడంతో ఈలోపు వైష్ణవ తేజ్‌తో ఓ మూవీ ప్లాన్ చేసాడు. ఆ సినిమాలో రకుల్‌ని హీరోయిన్ గా తీసుకుంటున్నాడట క్రిష్. మరి పవన్ సినిమాలోనూ, ఆయన మేనల్లుడు సినిమాలోనూ రకుల్‌కి ఒకేసారి అవకాశం రావడం నిజంగా రకుల్ అదృష్టమే.

One More Chance to Heroine Rakul Preet Singh:

Rakul Preet Singh in Krish and Vaishnav Tej Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ