Advertisementt

వరుణ్ సరసన ఇస్మార్ట్ భామ...?

Sat 15th Aug 2020 09:23 PM
varunn tej,ismart shankar,nabha natesh,kiran korrapati,allu aravind,bobby  వరుణ్ సరసన ఇస్మార్ట్ భామ...?
Varun Tej Romancing Ismart girl..? వరుణ్ సరసన ఇస్మార్ట్ భామ...?
Advertisement
Ads by CJ

మెగా హీరో వరుణ్ తేజ్ స్ఫోర్ట్స్ బేస్డ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విభిన్నమైన కథాంశాలని ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానన్ని సంపాదించుకున్న వరుణ్ బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొంత భాగం జరిగింది. కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయిన ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ ఎంపికైందని అన్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం సాయి మంజ్రేకర్ స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది. కరోనా కారణంగా ప్లానింగ్స్ అన్నీ మారిపోవడం, డేట్లు సర్దుబాటు కాకపోవడం మొదలగు కారణాల వల్ల సాయి మంజ్రేకర్ తప్పుకుందని వినబడుతుంది. అయితే సాయి స్థానంలో ఇస్మార్ట్ శంకర్ భామ నభా నటేష్ ఎంపికైందని అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న నభా నటేష్, వరుణ్ సరసన బాగుంటుందని ఫీల్ అవుతున్నారట.

ఈ విషయమై ప్రస్తుతానికి అధికార సమాచారం రానప్పటికీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత డిస్కోరాజాలో కనిపించిన నభా నటేష్ అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఇస్మార్ట్ ప్రభావం ఇంకా ఉండడం, యూత్ లో క్రేజ్ పెరగడం మొదలగు అంశాల వల్ల నభా నటేష్ వరుసగా అవకాశాలు తెచ్చుకుంటోంది. మరి వరుణ్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి. 

Varun Tej Romancing Ismart girl..?:

Varun Tej Romancing Ismart girl..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ